Viral News: ఇతడు మనిషా..? లేక దెయ్యమా..! తలను ఇలా తిప్పేస్తున్నాడు..! గగుర్పొడిచే దృశ్యం..

ప్రపంచంలో చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేసేవాళ్ళకు కొదవలేదు. అయితే కొన్నిసార్లు వాళ్లు చేసే విన్యాసాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయి....

Viral News: ఇతడు మనిషా..? లేక దెయ్యమా..! తలను ఇలా తిప్పేస్తున్నాడు..! గగుర్పొడిచే దృశ్యం..

Updated on: Jun 09, 2021 | 11:09 AM

మన తలను కొంత కోణం వరకు మాత్రమే తిప్పగలం. అందుకే మన వెనుక ఏం జరుగుతోందన్నది మనం చూడలేం. అయితే ఓ వ్యక్తి మాత్రం తన తలను ఏకంగా 180 డిగ్రీల వరకు తిప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తలను పూర్తిగా వెనక్కి తిప్పడం కేవలం గుడ్లగూబలకు మాత్రమే సాధ్యం. కానీ ఈ వ్యక్తి తన తలను అమాంతం 180 డిగ్రీలు తిప్పి చూపించాడు. మొదటగా ఆ వ్యక్తి తన ముఖాన్ని ముందుగా పైకెత్తాడు. ఆ తర్వాత అతడి గడ్డాన్ని వెనక్కి తిప్పాడు. దీంతో అతడి ముఖం వెనక్కి తిరిగిపోయింది. అలా వెనక్కి తిప్పిన ముఖాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్లీ యధాస్థితికి తిప్పేశాడు.

ఇది కేవలం అనుభవం ఉన్న స్టంట్ మ్యాన్‌ మాత్రమే చేయగలరు. మీరెవ్వరూ కూడా ఇలాంటి ట్రిక్స్‌ను ఇంట్లో ట్రై చేయకండి. ఎందుకంటే,..ఇలాంటివి ప్రాణానికే ప్రమాదం. కాగా, టిక్‌టాక్ యూజర్ @sheaabutt00 పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిని చూసిన నెటిజన్లు అతడు మనిషి కాదేమో.. దెయ్యమై ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి చదవండి:

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో

ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..

వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..