AP News: అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..

కన్నింగ్ గాళ్లతో నిండిపోయింది ఈ సొసైటీ.. సాటి మనిషి నమ్మాలంటేనే భయం వేస్తుంది. ఎవడు ఎటు నుంచి వచ్చి మాయ చేస్తాడో తెలీదు. ఈ దొంగోడు చూడండి మాయగా వచ్చి పేద ఇంటి ఆడకూతురి ఫోన్ కొట్టేశాడు.

AP News: అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..
Phone Thief

Updated on: Aug 21, 2024 | 7:09 AM

ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. అయ్యో పాపం అని జాలి తలిస్తే మనకే ఆరు నెలల శని పట్టినట్టు అయితుంది. ఈ రోజుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయం అయితుంది. అరె పాపం అని ఎవరికి అన్నా లిఫ్ట్ ఇద్దామన్న గుబులే..  ఎవరన్నా దగ్గరికి వచ్చి అక్క ఓసారి పోనిస్తావా.. ఇంట్లో వాళ్లతో మాట్లాడిస్తా అని అడిగినా అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయ్. అయ్యో పాపమని బయటి వ్యక్తిని నమ్ముతే ఫోన్ తీసుకుని ఉడాయించాడు ఓ దుండగుడు.

పాడేరు ఏజెన్సీ వద్ద ఓ పెట్రోల్ బంకులో..  పెట్రోల్ కొడ్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లాడు ఓ కేటుగాడు.. అక్కఅక్క అర్జెంట్ ఫోన్ చేస్కోవాలి.. నా ఫోన్‌లో బ్యాలెన్స.. ఓసారి నీ పోనిస్తవా అంటే.. అయ్యో పాపమని నమ్మి పోనిచ్చింది ఆమె.  వాడు ఫోన్ నెంబరు కొట్టినట్టు.. ఎవరికో ఫోన్ చేస్తున్నట్లు ఆస్కార్ రేంజ్‌లో బిల్డప్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చి.. వచ్చిన బైక్‌లో పెట్రోల్ కొడుతుంది ఆ మహిళ. ఇదే సరైన సమయమని భావించి..  మాట్లాడినట్టు పక్కకు పోయి అటు నుంచి అటే జంప్ అయ్యాడు కేటుగాడు.

పాపం ఆమె.. పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళ.  కష్టపడి బంక్‌లో పనిచేస్తున్నది.  ఎన్ని నెలల ఈఎంఐ పెట్టి ఆ ఫోన్ కొనుక్కుందో. ఆ పేదింటి ఆడబిడ్డ ఫోన్‌తో పరారయ్యాడు.. ఈ దొంగోడు. ఇప్పుడు ఎట్లాగూ వీడియో వైరల్ అవుతోంది. వాడు ఇంకొన్ని రోజులకు అయినా దొరక్కపోడు. ఇలాంటి వాళ్లను పోలీసోళ్లు సెల్లో వేసి బొక్కలిరగ కొడితే బుద్ది వస్తుంది అంటున్నారు నెటిజన్స్.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..