పార్టీ.. ఈ పేరు వింటే చాలు యువత కిర్రెక్కిపోతుంటారు. ఇక దోస్తులతో కలిసి చేసుకునే దావత్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మందు, చిందు, విందు లేనిదే.. పార్టీలు పూర్తి కావు మరి. ఇక కొత్త సంవత్సరం రోజును పార్టీ జరగకుండా ఉంటుందా. ఒక వేళ జరిగితే అది మామూలుగా ఉండదు. ఎంజాయ్‌మెంట్ అయినా, పాటలైనా.. స్టేజ్‌పై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయినా మనతో ఎవరూ పోటీ పడలేరు. కొన్నేళ్లుగా సోషల్ మీడియా ప్రపంచం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. జీవితంలో జరిగే సంఘటనలను ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాను వినోదం కోసం ఉపయోగిస్తున్నారు. ఏదైనా ఫన్నీ సంఘటన సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ప్రజల్లో చర్చనీయాంశమైంది.
పార్టీ ఎక్కడ ఉన్నా, భారతీయులకు అది చాలా స్పెషల్. పార్టీ లో చేసే డ్యాన్స్ ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించారు. ఇందులో ఇండియన్స్ పార్టీ సమయంలో డ్యాన్స్ మూవ్‌లను ఏ విధంగా చూపిస్తారు అనేది చక్కగా వివరించారు. వీడియోలో, ఒక వ్యక్తి పార్టీ డ్యాన్స్ రకాలను చూపుతుండటాన్ని చూడవచ్చు. తొమ్మిది గంటలకు అలా, పది గంటలకు అలా.. ఆపై..రాత్రి సమయం గడిచేకొద్దీ డ్యాన్స్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో.. ఇది కాకుండా, పార్టీ ప్రారంభం ఇంగ్లీష్ పాటతో మొదలై చివరకు హిందీలో ముగుస్తుందని ఈ క్లిప్‌లో చెప్పే ప్రయత్నం కూడా జరిగింది.
సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోని ఇన్ స్టా గ్రామ్ దటీజ్ ఇండియన్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ డ్యాన్స్ నిజంగా చాలా ఫన్నీగా ఉందని, ఇండియన్ డ్యాన్స్ నేర్చుకోవాలనుకునే వారు ఈ వీడియోను తప్పక చూడాలని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..