నీ లక్ బాగుంది బ్రదరూ.. రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.. లేకుంటే..

|

Oct 18, 2022 | 8:45 AM

రవాణా వ్యవస్థలో రైల్వేలు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాయి. తక్కువ ధరకు సుదూర ప్రాంతాలకు ప్రయాణీకులను చేరవేస్తూ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. మనమందరం ఏదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేసే ఉంటాం. ఇందులో..

నీ లక్ బాగుంది బ్రదరూ.. రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.. లేకుంటే..
Train Accident Video
Follow us on

రవాణా వ్యవస్థలో రైల్వేలు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాయి. తక్కువ ధరకు సుదూర ప్రాంతాలకు ప్రయాణీకులను చేరవేస్తూ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. మనమందరం ఏదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేసే ఉంటాం. ఇందులో జర్నీ చేయడం మంచి అనుభూతిని ఇస్తుంది. ఇది చాలా సౌకర్యవంతమైనదే కాకుండా ఆర్థికంగానూ సానుకూలంగా ఉంటుంది. అయితే రైలు నడుస్తున్న సమయంలో కిందికి దిగే ప్రయత్నం చేయకూడదు. సాధారణంగా ట్రైన్ స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో స్పీడ్ తగ్గుతుంది. అదే సమయంలో కొందరు రైలు నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగుతుంటారు. కొన్ని సార్లు ప్రమాదాలకూ గురయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి రైలు పూర్తిగా ఆగిన తర్వాతనే దిగాలి. రైలు దిగేటప్పుడు లేదా ఎక్కేటప్పుడు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మీరు ఎన్నో చూసి ఉంటారు. అయినప్పటికీ కొంత మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా మొండిగా బిహేవ్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారనడంలో ఎలాంటి డౌట్ లేదు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో అతనికి ఏమీ జరగలేదు. వీడియో చూస్తుంటే రైలులో ఖాళీ లేదనే విషయం తెలుస్తోంది. ఆ సమయంలో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి వేగంగా వస్తున్న సమయంలో కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అతను బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. అంతే కాకుండా కొంత దూరం లాక్కెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ అతను రైలు చక్రాల దగ్గరికి వెళ్లకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేకుంటే జరిగే పరిస్థితి గురించి ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ముంబైలోని ఓ లోకల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 12 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 18 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ముంబయి నగరం ప్రమాదాల నగరం’ అని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.