Viral Video: సముద్రం అడుగున అద్దాల హోటల్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటి అద్భుత నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన వీడియో వైరల్‌..

| Edited By: TV9 Telugu

Aug 15, 2023 | 6:02 PM

సముద్ర మట్టానికి దిగువన ఉన్న ఒక హోటల్ సూట్‌లో మీరు నిద్రపోవాలనుకుంటున్నారా..? సముద్ర జీవులను చూస్తూ.. హాయిగా సేదతీరొచ్చు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే చేపలు మిమల్నీ గిలిగింతలు పెడుతుంటాయి. ఇదంతా నిజమేనండోయ్‌.. అలాంటి హోటల్ సూట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలను పంచుకునే మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా ..

Viral Video: సముద్రం అడుగున అద్దాల హోటల్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటి అద్భుత నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన వీడియో వైరల్‌..
Underwater Hotel
Follow us on

మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ విభిన్నమైన వీడియోలు, ఆలోచనలను పోస్ట్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా, ఇప్పుడు అతను ప్రపంచంలోని మొట్టమొదటి నీటి అడుగున ఏర్పాటు చేసిన హోటల్‌కి సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానవ ఆవిష్కరణకు అంతం లేదు. అవసరాల కోసం కొన్ని సృష్టిస్తే.. ఆనందం, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించటం కోసం తయారు చేశారు. మరికొన్ని కొత్త ఆవిష్కరణలు ప్రకృతికి వ్యతిరేకంగా చేసినవి కూడా ఉంటాయి.. అదే విధంగా సముద్రం అట్టడుగున ఏర్పాటు చేసిన ఈ హోటల్ మాల్దీవుల్లోని ఈ హోటల్‌ను సముద్రాల్లో నిర్మించారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున ఉన్న హోటల్‌ వీడియోను షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. ది మురాకా అనే హోటల్‌లో ఒక రాత్రి గడపడాన్ని తాను మర్చిపోలేక పోయానని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను పోస్ట్ చేశారు. హోటల్ మురాకా మాల్దీవులు ప్రపంచంలోనే మొదటి నీటి అడుగున ఏర్పాటు చేసిన హోటల్‌గా చెప్పారు.. ఇక్కడ చాలా రిలాక్స్‌గా వారాంతాన్ని గడపవచ్చుననే సూచనతో ఈ వీడియోను షేర్‌ చేశారు. కానీ నిజం చెప్పాలంటే, తాను ఇక్కడ ఒక రాత్రి కూడా గడపలేనని అన్నారు..ఎందుకంటే.. ఈ గ్లాస్ సీలింగ్ మధ్యలో ఉన్న పగుళ్లను చూస్తుంటే.. బిక్కుబిక్కుమంటూ.. రాత్రంతా మెలకువగానే ఉండాల్సి వచ్చిందని ఆనంద్ మహీంద్రా రాశారు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా (బిజినెస్‌మెన్) షేర్ చేసిన ఈ వీడియోను 2 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. ఈ 30 సెకన్ల వీడియోలో హోటల్ లోపల ఎలా ఉందో చూపెడుతుంది. హోటల్ లోపల నుండి బయట నీటిలో చేపలు, ఇతర జలచరాల కదలికలను స్పష్టంగా గమనించవచ్చు. హోటల్ లోపల కూర్చోవడానికి లాంజ్ లాంటి ఏర్పాటు ఉంది. కూర్చుని తినడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు కూడా ఉంది. పడుకోవడానికి మంచం కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక్క రాత్రి బస చేసినందుకు 50 వేల డాలర్లు అంటే దాదాపు 41 లక్షల రూపాయలు.

ఈ మురాకా హోటల్ నవంబర్ 2018లో ప్రారంభించబడింది. సముద్ర మట్టానికి 16 అడుగుల దిగువన ఉంది. ఈ హోటల్ సైట్ హిల్టన్ కాన్రాడ్ మాల్దీవ్స్ రంగాలి ఐలాండ్ రిసార్ట్‌లో ఒక భాగం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..