కోరిన కోర్కెలు తీర్చే దేవుడు..! కానీ, అబ్బాయిలు, అమ్మాయిలుగా వస్తేనే ఆలయంలోకి ఎంట్రీ.. ఎక్కడంటే..

సాంప్రదాయ చీరలు, ఆడవాళ్లకు ఏమాత్రం తీసిపోయిన అందమైన అలంకరణతో మగవారు పొడవైన క్యూలలో వరుసగా ఆలయంలో క్యూ కడతారు. ప్రతి ఒక్కరూ ఒక విలక్షణమైన దీపాన్ని మోసుకెళ్లి దేవతకు ప్రార్థనలు చేస్తారు. పురాణాల ప్రకారం ఇలా చేసిన మగవారి అన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.

కోరిన కోర్కెలు తీర్చే దేవుడు..! కానీ, అబ్బాయిలు, అమ్మాయిలుగా వస్తేనే ఆలయంలోకి ఎంట్రీ.. ఎక్కడంటే..
Kollankulangara Devi Temple

Updated on: Mar 29, 2025 | 7:45 PM

కేరళలోని కొల్లం జిల్లా కోల్లారా గ్రామంలో కొలువైన ‘కొట్టంకులంగర దేవి’ ఆలయంలో ఓ వింత ఆచారం కొనసాగుతుంది. ఇక్కడి ఆలయంలో ఏటా మార్చిలో చమయవిళక్కు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవంలో పురుషులకు ప్రవేశం లేదు. ఒక వేళ వెళ్లాలంటే అచ్చం అమ్మాయిలుగా అలంకరించుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పలువురు యువకులు అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా అలంకరించుకొని ఆలయానికి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ వింత ఆచారం విశేషాలు, ప్రత్యేకత ఏంటంటే..

కేరళ నడిబొడ్డున కొల్లం జిల్లా చావరలోని కొట్టంకులంగర దేవి ఆలయంలో ఈ వింత ఆచారం కొనసాగుతుంది. దేవత పట్ల భక్తితో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. జరుగుతుంది. కొట్టంకులంగర చామయవిళక్కు అని పిలువబడే ఈ అసాధారణ సంప్రదాయం, ఆలయం 19 రోజుల వార్షిక ఉత్సవంలో చివరి రెండు రోజులలో పాటిస్తారు.

నివేదిక ప్రకారం, సాంప్రదాయ చీరలు, ఆడవాళ్లకు ఏమాత్రం తీసిపోయిన అందమైన అలంకరణతో మగవారు పొడవైన క్యూలలో వరుసగా ఆలయంలో క్యూ కడతారు. ప్రతి ఒక్కరూ ఒక విలక్షణమైన దీపాన్ని మోసుకెళ్లి దేవతకు ప్రార్థనలు చేస్తారు. పురాణాల ప్రకారం ఇలా చేసిన మగవారి అన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..