మన కళ్లకు పరీక్ష.. మెదడుకు మేత వేసే చిత్ర విచిత్రమైన ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే ఉంటాయి. ట్రెండింగ్ విశేషాలకు సోషల్ మీడియా నిలయం. కాస్త బోర్ కొట్టిందంటే చాలు.. నెట్టింట కావల్సినంత వినోదం లభిస్తుంది. క్యూరియాసిటీని పెంచడంలో ఫోటో పజిల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో ఉన్నది జంతువైనా/వస్తువైనా దాన్ని కనిపెట్టేవరకు తగ్గేదేలే అన్నట్లు యువత ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పడతారు. ఇలాంటి ఫోటోల కోసమే కొందరు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలను సైతం పెడుతున్నారు. ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత నక్కింది. అదెక్కడుందో మీరు గుర్తించండి. పర్వత ప్రాంతంలా కనిపిస్తోన్న ఈ ప్రదేశంలో ఎక్కువగా మంచు చిరుతలు నివసిస్తుంటాయి. అలాంటి ఓ మంచు చిరుత ఈ ఫోటోలో దాగుంది. రాళ్ల రంగులో దాని రంగు ఇమిడిపోవడంతో మీరు కనిపెట్టడం కొంచెం కష్టమే. కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా పజిల్ సాల్వ్ చేయగలరు. నూటికి 95 శాతం మంది ఈ ఫోటో పజిల్ సాల్వ్ చేశారు. ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్‌ను యాడ్ చేయలేదు. ఫోటోగ్రాఫర్ తన కెమెరా పనితనంతో తీసింది మాత్రమే. లేట్ ఎందుకు మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే.. క్రింద ఫోటోను చూడండి.
Also Read:
గుడ్డులోని పసుపు భాగాన్ని ఎంతమంది తినరు.? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు.!
హనీమూన్‌లో ఊహించని ట్విస్ట్.. భర్త చేసిన పనికి భార్య ఫ్యూజులు ఔట్!
Here Is The Answer… pic.twitter.com/WpjaHXwmrf
— telugufunworld (@telugufunworld) December 18, 2021