Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ గుంపులో దాగున్న ఎలుగుబంటిని గుర్తిస్తే మీరే గ్రేట్.!

|

Jun 23, 2022 | 1:25 PM

ఇంటర్నెట్‌లో అప్పుడప్పుడూ చూసేందుకు కొన్ని చిత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి. కానీ అవి మన కళ్లకు ఎప్పటికప్పుడు పరీక్ష పెడుతుంటాయి. వాటిల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది. ఇక ఇలాంటి వాటిని ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు అని అంటారు. ఏకాగ్రత, డేగ లాంటి కళ్లు ఉన్నప్పుడే ఈ ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయగలం. ప్రస్తుతం నెట్టింట వీటి ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల కంటూ ప్రత్యేక పేజీలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓ […]

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఈ గుంపులో దాగున్న ఎలుగుబంటిని గుర్తిస్తే మీరే గ్రేట్.!
Optical Illusion
Follow us on

ఇంటర్నెట్‌లో అప్పుడప్పుడూ చూసేందుకు కొన్ని చిత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి. కానీ అవి మన కళ్లకు ఎప్పటికప్పుడు పరీక్ష పెడుతుంటాయి. వాటిల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది. ఇక ఇలాంటి వాటిని ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు అని అంటారు. ఏకాగ్రత, డేగ లాంటి కళ్లు ఉన్నప్పుడే ఈ ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయగలం. ప్రస్తుతం నెట్టింట వీటి ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల కంటూ ప్రత్యేక పేజీలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓ పజిల్ సాల్వ్ చేసినప్పుడు.. ఆ కిక్కే వేరబ్బా.. చాలామంది ఇలాంటి పజిల్స్‌ను తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పైన పేర్కొన్న చిత్రాన్ని ఓసారి గమనించండి.. మీకు గడ్డి మేస్తోన్న ఎద్దులు చుట్టూ కనిపిస్తాయి. ఆ ప్రాంతమంతా అవే ఉన్నాయనుకుంటే పొరపాటే.. ఒక్కసారి ఫోటోకు ఎడమ వైపు దృష్టి పెట్టండి.. ఎద్దుల మధ్యలో ఓ ఎలుగుబంటి ఉంది. మీరు దాన్ని గుర్తుపట్టారా.? మేధావులు అయితే ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.. నిశితంగా ఫోటోను చూడండి.. ఒకవేళ సమాధానం దొరకపోతే కింద ట్వీట్‌లోకి వెళ్లండి.

ఇవి కూడా చదవండి

సమాధానం: ఫోటోకు ఎడమ వైపు.. మొదటిగా కనిపించే ఎద్దు వెనక ఎలుగుబంటి ఉంటుంది.