VIRAL VIDEO : పెళ్లంటే నూరేళ్ల పంట. అలాంటి పెళ్లిలో ఏదైన సంఘటన జరిగితే అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది. వివాహం కలకాలం ఉండాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. అది లేకుంటే ఆ వివాహం నిలువదు. పర్యవసనంగా భార్యా భర్తల సంబంధం అస్తవ్యస్తంగా మారుతుంది. తరచూ విభేధాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం కాలంలో నిత్యం మనం ఎన్నో విడాకుల కేసులను చూస్తున్నాం. దీనికి కారణం భార్యా భర్తల మధ్య గౌరవం, ప్రేమ సరిగ్గా లేకపోవడమే. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వివాహానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో పెళ్లి సమయంలో వరుడు వేదికపై నిలబడి కనిపిస్తాడు. వధువు కూడా నిశ్శబ్దంగా ముఖంలో ఎటువంటి సంతోషం లేకుండా కనిపిస్తుంది. వరుడు వధువు మెడలో దండవేసే సమయంలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తాడు. వధువుపై దండ విసురుతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. పెళ్లి వేదికపై వరుడు ప్రవర్తించిన విధానం ఎవరికీ నచ్చలేదు. దీంతో అతడిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 8000 మందికి పైగా చూశారు. ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కరూ ఈ వీడియోలోని వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసిన తరువాత ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఒకరు “ఎంత భయంకరమైన మనిషి” అని, మరొకరు “విడిపోవటం మంచిది” అని సలహా ఇస్తున్నారు.
మీ భార్య మిమ్మల్ని గౌరవించాలంటే ముందు మీరు ఆమెను గౌరవించడం నేర్చుకోండి అంటూ సోషల్ మీడియాలో పలువురు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల DJ పాటకు డ్యాన్స్ చేసిన ఓ పెళ్లి జంట కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇందులో వధూ వరులు ఇద్దరు ఒకరికొకరు గౌరవించుకున్నారు. ఇద్దరు కలిసి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ప్రజలు తెగ ఇష్టపడ్డారు. ఎందుకంటే వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అందుకే వారిని అందరు ఆశీర్వదించారు.