Great Khali: వంట మాస్టర్‌గా మారిన WWE స్టార్.. కిచెన్‌లో కుకింగ్ విన్యాసాలు.. వైరల్ అవుతున్న వీడియో.

|

Sep 30, 2023 | 5:42 PM

Great Khali: ఒకప్పుడు WWE రింగ్‌లో రెజ్లింగ్ చేసిన దలిప్ సింగ్ రాణా.. అదేనండీ మన దేశానికే చెందిన ‘గ్రేట్ ఖలి’ ఇప్పుడు వంట మాస్టర్ అవతారమెత్తాడు. హర్యానాలోని తన ‘ది గ్రేట్ ఖలి దాబా’లోని వంటగదిలోకి ప్రవేశించి వంట చేసే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్..

Great Khali: వంట మాస్టర్‌గా మారిన WWE స్టార్.. కిచెన్‌లో కుకింగ్ విన్యాసాలు.. వైరల్ అవుతున్న వీడియో.
The Great Khali
Follow us on

Great Khali: ఒకప్పుడు WWE రింగ్‌లో రెజ్లింగ్ చేసిన దలిప్ సింగ్ రాణా.. అదేనండీ మన దేశానికే చెందిన ‘గ్రేట్ ఖలి’ ఇప్పుడు వంట మాస్టర్ అవతారమెత్తాడు. హర్యానాలోని తన ‘ది గ్రేట్ ఖలి దాబా’లోని వంటగదిలోకి ప్రవేశించి వంట చేసే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. WWE రింగ్‌లో ప్రత్యర్థులను చితక బాదిన ఖలి.. ఇప్పుడు వంట గదిలో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

‘ఇంట్లో ప్రయత్నించవద్దు’ అనే క్యాప్షన్‌తో సెప్టెంబర్ 24న పోస్ట్ చేసిన వీడియోలో.. ఖలీ తన రెస్టారెంట్‌లోని వంట గదిలో వంట చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించాడు. అయితే స్టవ్ మీద ఉన్న పాత్రలో గరిటె పెట్టగానే దాని నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఖలి వెంటనే దాన్ని పడేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఖలి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వీక్షణలు, కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీడియోకు ఇప్పటి వరకు 34 లక్షల 33 వేల లైకులు, 7 కోట్ల 76 లక్షల వీక్షణలు లభించాయి.

జాన్ సీనాతో ఖలి..

కాగా, 2000 సంవత్సరంలో తన రెజ్లింగ్ కెరీర్‌ని ప్రారంభించిన గ్రేట్ ఖలి CWE, WCW, NJPW, WWE వంటి రెజ్లింగ్ కంపెనీల్లో రెజ్లర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2007-08 మధ్య కాలంలో WWE వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌ అయ్యాడు. ఇంకా WWE హాల్ ఆఫ్ ఫేమ్‌గా క్లాస్ ఆఫ్ 2021‌లో ఎంపికయ్యాడు. ఇక 2018 ఏప్రల్ 27న తన రెజ్లింగ్ కెరీర్‌ నుంచి రిటైర్ అయ్యాడు.