Giant Hogweed Plant: పచ్చటి మొక్కలను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అందమైన పూల మొక్కలు మనసుకు ఆహ్లాదాన్ని చేకూరుస్తున్నాయి. ఐతే వీటిల్లో కొన్ని అత్యంత ప్రమాదకరమైన విషపు మొక్కలు కూడా ఉంటాయి. వీటిని ముట్టుకున్నా, వాటి గాలి పీల్చినా ప్రాణాలు విడవాల్సిందే..అదే “హాగ్‌వీడ్’ దీన్నే ‘కిల్లర్ ట్రీ’అని కూడా అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ చెట్టు..క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది.
హాగ్‌వీడ్ మొక్కలు చాలా ప్రమాదకరమైనవని, మానవ శరీరం దానికి తగిలినపుడు విషపూరితమైన ద్రవాలను మనిషి శరీరంలోకి జొప్పిస్తాయి. చూడటానికి అందంగా ఉంటుంది. కానీ, దీని విషం సోకిన మనిషిని నిలువునా కాల్చేంతటి ప్రమాదకారి ఈ మొక్క. ఈ మొక్క పాముల కన్నా విషపూరితమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పొరపాటున ఈ చెట్టును తాకినట్లయితే, కొన్ని గంటల వ్యవధిలోనే చర్మం కాలిపోతున్నట్లు అనిపిస్తుంది. చర్మంపై బొబ్బలు ఏర్పడి తీవ్ర అనారోగ్యం పాలుకావాల్సి వస్తోంది. తిరిగి కోలుకోవటానికి చాలా కాలం పడుతుందని చెబుతున్నారు.
అసలు ఈ మొక్క ఇంతటి విషపూరితం కావడానికి కారణం దీని లోపల ఉండే కెమికల్ సెన్సింగ్ ఫ్యూరానోకౌమరిన్స్, ఈ కెమికల్ వల్ల మొక్క అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్‌ను సమతుల్యం చేయడంలో ఈ మొక్క ముఖ్య పాత్ర పోషిస్తుందట.
Also Read:
Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!
Scary Video: ”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!
అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!