క్రూయిజ్ షిప్‌లో ప్రపంచాన్ని పర్యటించాలని.. ఆస్తులన్నీ అమ్మేసుకున్న జంట.. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా..?

|

Dec 27, 2023 | 3:59 PM

ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంటి ఖర్చులు కూడా లేవు, కారు ఇన్సూరెన్స్ లేదు, హోమ్ ఇన్సూరెన్స్ లేదు, ఈ క్రూయిజ్ షిప్ ట్రిప్ చాలా చౌకగా ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్పగలమంటూ ఈ జంట ఎంతో సంతోషంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.

క్రూయిజ్ షిప్‌లో ప్రపంచాన్ని పర్యటించాలని.. ఆస్తులన్నీ అమ్మేసుకున్న జంట.. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా..?
A Us Couple
Follow us on

ప్రపంచాన్ని చుట్టిరావాలని, ఎన్నో దేశాలను చూడాలని చాలా మంది కలలు గంటుంటారు. అయితే, అవన్నీ నెరవేరాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలా మంది తమ కలలకు బ్రేకులు వేసుకుని కూర్చుంటారు. అయితే ఈ అమెరికన్ దంపతులు క్రూయిజ్ షిప్‌లో ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు ఎవరూ చేయని సాహాసం చేశారు. తమకున్న ఇళ్లు, ఆస్తులతో సహా తమ వ్యాపారాలన్నింటినీ అమ్మేసి తమకు నచ్చిన విధంగా టూర్‌ ఎంజాయ్ చేశారు.. అంతే కాదు, భూమిపై జీవించడం కంటే క్రూయిజ్ షిప్‌లో జీవన వ్యయం తక్కువ అని చెబుతున్నారు. వారి మాటలకు యాత్రికులు సైతం ఆశ్చర్యపోయారు. అమెరికన్ ఫ్లోరిడా నివాసితులు జాన్ మరియు మెలోడీ హెన్నెస్సీ దంపతులు ప్రపంచాన్ని పర్యటించడానికి తమ ఆస్తులన్నింటినీ విక్రయించారు. మూడేళ్ల క్రితం తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకునేందుకు గానూ వారి ఆస్తులన్నీ అమ్మేశాడు.

ఈ జంట ముందుగా తమ పర్యటన కోసం ఒక మోటర్‌హోమ్‌ను కొనుగోలు చేశారు. కానీ మెలోడీ హెన్నెస్సీ కోసం జాన్‌ స్వయంగా దానిని నడిపించేవాడు. అలా వారు తమ టూర్‌తో అలసిపోయిన తర్వాత, వారు ఓడలో ప్రపంచ పర్యటనకు బయల్దేరారు.. ఇంతకుముందు, ఈ జంట సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో రాయల్ కరీబియన్ క్రూయిసెస్ కోసం ఒక ప్రకటనను చూసింది. ఇందులో 274 రోజులు అంటే 9 నెలలు గడిపే అవకాశం వచ్చింది. అతను వెంటనే ఈ క్రూయిజ్‌ను సంప్రదించి వెంటనే తన పేరును నమోదు చేసుకున్నాడు. అప్పుడు అతను ప్రపంచాన్ని పర్యటించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ పసిఫిక్‌లోని అనేక ప్రదేశాలతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లిన ఈ జంట ప్రస్తుతం డొమినికన్ రిపబ్లిక్‌లో పర్యటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రయాణం వారు భూమిపై బందీలుగా జీవించాల్సిన దానికంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంటి ఖర్చులు కూడా లేవు, కారు ఇన్సూరెన్స్ లేదు, హోమ్ ఇన్సూరెన్స్ లేదు, ఈ క్రూయిజ్ షిప్ ట్రిప్ చాలా చౌకగా ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్పగలమంటూ ఈ జంట ఎంతో సంతోషంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. .

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..