Viral Video: స్టంట్ ఫెయిలయ్యింది.. వీపు విమానం మోత మోగింది..

|

Nov 19, 2021 | 1:46 PM

సోషల్ మీడియా వచ్చాక జనాలకు ఫేమస్ అవ్వాలనే ఆరాటం పెరిగింది. తిక్క తిక్క పనులు చేస్తూ.. వాటిని వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు.

Viral Video: స్టంట్ ఫెయిలయ్యింది.. వీపు విమానం మోత మోగింది..
Stunt Fail Video
Follow us on

సోషల్ మీడియా వచ్చాక జనాలకు ఫేమస్ అవ్వాలనే ఆరాటం పెరిగింది. తిక్క తిక్క పనులు చేస్తూ.. వాటిని వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.  తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నాడు. కానీ, మరుసటి క్షణం అతనికి హితబోధ జరిగింది. స్టంట్ ఫెయిలయ్యి వీపు విమానం మోత మోగింది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువకుడు స్కూటీతో స్టంట్ చేయడానికి ప్రయత్నించడం మీరు చూడవచ్చు. ఈ క్రమంలో అతను మొదట స్కూటీ ముందు భాగాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఆపై వెంటనే బ్రేక్స్ వేశాడు. కానీ అతడి స్టంట్ ఫెయిలై.. బౌన్స్ అయ్యి ముందుకు పడ్డాడు. కింద రోడ్డు బలంగా ఉండటంతో అతనికి గట్టిగానే దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. హెల్మెట్ కూడా లేదు. తలకు కానీ దెబ్బ తగిలి ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది.

వీడియో చూడండి..

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ‘కోసాస్ డి లా విడా'(Cosas de la Vida) అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి పది వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లను కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘ఇలాంటి స్టంట్స్ చేయడం… మరణాన్ని ఆహ్వానించడం లాంటిది’ అని ఒక నెటిజన్ పేర్కొనగా… ‘ఇలాంటి వ్యక్తులు ఇలా చేసే ముందు తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించరు’ అని ఒక యూజర్ రాసుకొచ్చారు.

Also Read: తెల్లవారుజామున కెనాల్ ఒడ్డున ఒంటరిగా బాలుడు.. స్థానికులు ఆరా తీయగా షాక్

 ఏపీలో జల ప్రళయం.. కడప జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది గల్లంతు