ఆ మహిళ రోజూలాగే స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఇక స్నానం అనంతరం తలుపు తీసేందుకు ప్రయత్నించగా.. అది ఎంతకీ తెరుచుకోలేదు. సాయానికి గట్టిగా అరిచింది. ఆమె గోడు పట్టించుకునే నాధుడు లేకపోయాడు. కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో తెలుసా.. ఆ కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కు చెందిన 54 ఏళ్ల మహిళ రోజూలాగే.. ఈ నెల 22వ తేదీన కూడా స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లింది. స్నానం చేసిన అనంతరం డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా.. లాక్ జామ్ కావడంతో.. తలుపు ఎంతకూ తెరుచుకోలేదు. ఆ మహిళ తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తుండటంతో.. సాయం కోసం ఆమె అరుస్తున్నా.. పట్టించుకునే నాధుడు ఎవ్వరూ లేకపోయారు. ఒకటి… రెండు… మూడు రోజులైనా ఎవరూ సహాయం కోసం రాలేదు. దీంతో తన ప్రాణంపై ఆశ వదులుకుంది. లిప్‌స్టిక్‌తో బాత్రూమ్ గోడలపై తన వీలునామా రాసింది. కట్ చేస్తే.. మూడు రోజుల తర్వాత ఓ అద్భుతం జరిగింది.
తన సోదరి ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో.. ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సదరు మహిళ ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి.. బాత్రూమ్ డోర్ తీయగా.. మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమెను చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్యం కుదుటపడిందని తెలుస్తోంది.(Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..