Viral Video: తగ్గేదెలా అంటూ కొట్టుకున్న రెండు పులులు.. వీడియో వైరల్..

|

Aug 21, 2024 | 5:36 PM

సాధారణంగా పులులు.. ఇతర జంతువులపై ఎటాక్ చేసిన వీడియోలు చూసి ఉంటారు. పులులు కొట్టుకున్న వీడియో మాత్రం అసలు ఎవరూ చూసి ఉండరు. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు పులులు కొట్టుకున్నాయి. ఈ రెండింటి పులుల మధ్య వయసు చాలా తేడా ఉంది. అయినా కూడా ఏమాత్రం తగ్గేదెలా అంటూ రెండు పులులూ కాలుదువ్వాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో..

Viral Video: తగ్గేదెలా అంటూ కొట్టుకున్న రెండు పులులు.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

సాధారణంగా పులులు.. ఇతర జంతువులపై ఎటాక్ చేసిన వీడియోలు చూసి ఉంటారు. పులులు కొట్టుకున్న వీడియో మాత్రం అసలు ఎవరూ చూసి ఉండరు. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు పులులు కొట్టుకున్నాయి. ఈ రెండింటి పులుల మధ్య వయసు చాలా తేడా ఉంది. అయినా కూడా ఏమాత్రం తగ్గేదెలా అంటూ రెండు పులులూ కాలుదువ్వాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతుంది. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియోలో.. అడవి మధ్యలో ఒక దారి ఉంది. అక్కడ ఒక పులి నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. ఒక పెద్ద పులి అతని వైపు నెమ్మదిగా వచ్చింది. ఇది పులి కంటే వాల్యూమ్‌లో చాలా పెద్దది. కూర్చొన్న పులిని చూసిన పులి ఒక్కసారిగా దానిపైకి దూసుకెళ్లింది. పెద్ద పులి దాడి చేయడాన్ని గమనించిన చిన్న పులి కూడా ఎటాక్‌కి సిద్ధమైంది. ముందు ఉన్న రెండు కాళ్లను పైకెత్తి గాలిలోకి ఎగిరింది. రెండు పులులు గట్టిగానే కొట్టుకున్నాయి. ఈ ఫైట్ చూస్తుంటే.. రెండు పులులు అసలు ఏ మాత్రం తగ్గేదెలా అన్నట్టు కనిపించాయి.

రెండు సార్లు కొట్టుకున్న తర్వాత రెండు పులులు సైలెంట్ అయ్యాయి. కానీ ఓటమిని అంగీకరించడానికి మాత్రం ఏ పులి కూడా సిద్ధంగా లేదు. పెద్ద పులి నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఉండగా.. చిన్న పులి దాన్ని గమనిస్తూ ఉంది. ఎటాక్ చేస్తే.. తిరిగి ఎటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి ఈ వీడియో కాస్తా నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఇప్పటిదాకా ఇతర జంతువుల మీద దాడి చేసిన పులులు కొట్టుకోవడాన్ని నెటిజన్లు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ వీడియోకి వరుస కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువగా అల్లు అర్జున్ పుష్ప మూవీ డైలాగ్‌ ‘తగ్గేదెలా’ అని పెడుతున్నారు.

వీడియో చూసేయండి.