Viral Video: టీచర్ గారి ఓవరాక్షన్‌కి ఉన్నతాధికారులు ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలిస్తే షాకే

|

Jul 28, 2022 | 3:04 PM

ఓ ఉపాధ్యాయురాలు నీటిలో తడవకూడదని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సదరు టీచర్‌ చేసిన పనికి ఉన్నతాధికారుల నుండి..

Viral Video: టీచర్ గారి ఓవరాక్షన్‌కి ఉన్నతాధికారులు ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలిస్తే షాకే
Teacher Enters
Follow us on

Viral Video: దేశవ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాలు, వరదలతో నదులు,ప్రాజెక్టులు,రిజర్వాయర్లు, వాగులు ఉప్పొంగిప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. కాలనీల్లోకి చేరిన వరద నీరు వందల ఇళ్లను ముంచేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల స్కూల్‌ పిల్లలు, సిబ్బందికి సైతం అవస్థలు తప్పటం లేదు. ఈ క్రమంలోనే ఓ ఉపాధ్యాయురాలు నీటిలో తడవకూడదని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సదరు టీచర్‌ చేసిన పనికి ఉన్నతాధికారుల నుండి సస్పెన్షన్‌ వేటు పడింది. ఇంతకీ ఏం జరిగింది..? అనేది పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు తను నీటిలో తడవకూడదని విద్యార్థులతో కూర్చీలు వేసుకుంది. ఆ తర్వాత ప్లాస్టిక్ కుర్చీలపైకి ఎక్కి వరదలో ఉన్న పాఠశాలలోకి వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. స్కూల్‌ గేటు నుంచి పాఠశాల భవనానికి మధ్య భారీగా వర్షపు నీరు చేరి ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ నీటిలో నడిచేందుకు ఇష్టపడక అక్కడే ఉన్న విద్యార్థులను పిలిచి స్కూల్ లో ఉన్న కూర్చీలను బయటకు తెప్పించి గేటు నుంచి భవనం వరకు వేయించుకున్నారు. పిల్లల సహాయంతో కూర్చీలు ఎక్కుతూ భవనం వద్దకు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పాఠశాల ఆవరణ జలమయమైంది. ఆ సమయంలో ఈ ఘటన జరగగా మరో టీచర్ వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి చేరటంతో సదరు టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి