Viral Video: కళ, సృజనాత్మకత ఏ ఒక్కరి సొంతం కాదు. ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన కళ దాగి ఉంటుంది. బయటకు కనిపించని సృజనాత్మకత వారిలో ఉంటుంది. సకల కళావల్లభులు(మల్టీ టాలెంటెడ్ పర్సన్స్) ఉంటారు. వీరు అనేక అంశాలపై పట్టు కలిగి ఉంటారు. తాజాగా ఓ మంత్రి ప్రజా పాలకుడిగానే గాక.. తనలో మరో యాంగిల్ కూడా ఉందంటూ సమాజానికి చెప్పాడు. ఐటీ శాఖ మంత్రి అయిన ఆయన.. ‘‘తాను ఐటీ మినస్టర్‌ని, సాఫ్ట్‌గా ఉంటానని అనుకుంటున్నారేమో. నాకు ఇతర విద్యలపైనా పట్టుంది.’’ అని చాటిచెప్పారు. ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటైన కర్రసాము చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంకీ ఆ ఐటీ మినిస్టర్ ఎవరు? ఎక్కడ కర్రసాము చేశారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకెళితే.. తమిళనాడులో ప్రాచీన యుద్ధ కళా విద్యల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. నాగర్ కోయిల్‌లోని లెమురియా వర్మకళారి ఆదిమురై ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను వీక్షించేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్ హాజరయ్యారు. సంప్రదాయ పంచెకట్టుతో విచ్చేసిన ఆయన బరిలో దిగి కర్రసాముతో అలరించారు. మంత్రి ఎంతో వేగంగా కర్రసాము చేయడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్ విన్యాసాలతో మంత్రి మనో తంగరాజ్ ఎంతో ఉత్సాహంగా కదిలారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, లెమురియా ఫౌండేషన్ లో ఇలాంటి ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తూ ప్రతి ఏటా వారిమధ్య పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.
நாகர்கோவில் அண்ணா விளையாட்டு அரங்கத்தில் லெமூரியா வர்மகளரி அடிமுறை உலக கூட்டமைப்பு சார்பாக நடைபெற்ற நிகழ்வில்… pic.twitter.com/KtOfAQMBim
— Mano Thangaraj (@Manothangaraj) February 27, 2022
Also read:
Defection Case: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్.. మరో అవకాశం దిశగా ఆ పార్టీ అడుగులు..
Russia Ukraine War: రష్యా అధ్యక్షుడికి షాకిచ్చిన జూడో ఫెడరేషన్.. ఆ పదవి నుంచి సస్పెండ్..
Adavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకోని అతిధులు…(లైవ్ వీడియో)