Viral Video: ప్రతీ మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ప్రాధాన్యత గురువుదే. అందుకే గురువుకు మనం ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. దైవంతో సమానంగా ఆరాధిస్తుంటాం. నిజంగా ఈ సమాజంలో ఎంతో మంది తమ గురువులను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహించారు. ఇక గురువు కూడా చిన్నారుల స్థాయికి తగ్గి వారికి పాఠాలను విడమరిచి చెబుతుంటారు. ఇందు కోసం ఒక్కో టీచర్ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. విద్యార్థులకు పాఠాలను అర్థమయ్యేలా చెప్పడానికి ఓ టీచర్ ఏకంగా డ్యాన్స్ మాస్టర్‌గా మారిపోయారు. విభిన్నమైన టీచింగ్ స్టైల్‌తో ఆకట్టుకుంటోన్న ఆ టీచర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని చెంగల్పట్టు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కవిత ఉపాద్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళం బోధించే ఈ టీచర్ విద్యార్థులకు భాష అర్థమయ్యేలా చెప్పేందుకు విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. భరత నాట్యం స్టెప్పులు వేస్తూ విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. దీంతో చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఎంచక్కా పాఠాలు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు.. ‘మేము కూడా చదువుకునే రోజుల్లో కూడా ఇలా పాఠాలు చెబితే బాగుండేది’, ‘ఇలా చెబితే విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటారు’ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Vikram Vedha: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విక్రమ్ వేద బాలీవుడ్ రీమేక్..
Cheddi Gangs: ఏపీలో దడ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్స్.. నగర శివారులే టార్గెట్.. అడ్డొస్తే అంతే..