Viral News: బీమా డబ్బుల కోసం ఆశపడ్డాడు.. కాళ్ళు కోల్పోయాడు.. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు.. ఎక్కడంటే..

కొంతమంది డబ్బులు సంపాదన కోసం శక్తికి మించి కష్టపడితే.. మరికొందరు డబ్బులను సంపాదించడానికి అడ్డదార్లు తొక్కుతారు. డబ్బు సంపాదించడానికి తప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తారు. ఇలాంటి సమయంలో ఒకొక్కసారి అనుకోని విధంగా చిక్కుల్లో చిక్కుకుంటారు. ఈ రోజుల్లో అలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన కాలును కోల్పోవడమే కాదు బీమా డబ్బు సంపాదించడానికి జైలుకు కూడా వెళ్లాడు.

Viral News: బీమా డబ్బుల కోసం ఆశపడ్డాడు.. కాళ్ళు కోల్పోయాడు.. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు.. ఎక్కడంటే..
Taiwanese Man Insurance Scam

Updated on: Jun 28, 2025 | 3:33 PM

డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక. దీని కోసం కొంత మంది వ్యక్తులు చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేస్తారు. తద్వారా అతను తన కోరికలను తీర్చుకునేందుకు తగినంత డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి షార్ట్‌కట్స్ లో ప్రయాణించే వారు కొందరు ఉన్నారు. చాలా మంది ఈ ట్రిక్‌లో విజయం సాధిస్తే.. మరికొందరు స్వయంగా తాము పన్నిన ఉచ్చులో తామే చిక్కుకుంటారు. అలాంటి ఒక కేసు ఈ రోజుల్లో వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి బీమా కంపెనీ నుంచి డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. అందుకోసం ఎంచుకున్న ప్రక్రియలో తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ వింత ఘటన తైవాన్ లో చోటు చేసుకుంది.

మీడియా నివేదికల ప్రకారం తైవాన్ నివాసి అయిన జాంగ్, బీమా కంపెనీలను మోసం చేయడానికి పది గంటల పాటు తన పాదాలను డ్రై ఐస్‌లో ఉంచాడు. ఎక్కువ సమయం జాంగ్ తన పాదాలను డ్రై ఐస్‌లో ఉంచడంతో.. అతని రెండు పాదాలను కత్తిరించాల్సి వచ్చింది. ఇలా చేయడం ద్వారా బీమా కంపెనీ నుంచి డబ్బు వస్తుందని, తాను సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని అతను ఆశించాడు. అయితే ఆ వ్యక్తి తాను పన్నిన ఉచ్చులో తానే చిక్కుకున్నాడు. తన పాదాలను కోల్పోయాడు.. అదనంగా ఇప్పుడు అతను జైలు ఊసలు లేక్కిస్తాడు.

ఈ సంఘటన ఎప్పటిది అంటే

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం ఈ కేసు 2005 నాటిది. జాంగ్ అనే వ్యక్తి తైపీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఈ సమయంలో అతను ఐదు వేర్వేరు కంపెనీల నుంచి అనేక బీమా పాలసీలను కొనుగోలు చేశాడు. వీటిలో ఆరోగ్యం, జీవితం, ప్రమాదం, దీర్ఘకాలిక సంరక్షణ, ప్రయాణం వంటి అనేక రకాల బీమాలు ఉన్నాయి. ఈ భీమ కంపెనీల నుంచి డబ్బులు రాబట్టేందుకు అతి తెలివితో ప్లాన్ చేశాడు. తన కాలును కోల్పోయాడు. ఎక్కువ సమయం ఐస్ లో ఉంచడం వలన వైద్యులు అతని కాలును కత్తిరించాల్సి వచ్చింది.

దీని తరువాత.. జాంగ్ తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేశాడు. ఒక వీడియో తీసి.. రాత్రి సమయంలో మోటార్ సైకిల్ నడుపుతుండగా.. జాంగ్ కాళ్ళు అకస్మాత్తుగా చల్లగా అనిపించడం మొదలైందని బీమా కంపెనీకి చెప్పాడు. అందుకే అతని కాళ్ళు తొలగించాల్సి వచ్చింది. కనుక దీని కోసం అతను బీమా కంపెనీల నుంచి 12 కోట్లు డిమాండ్ చేశాడు. జాంగ్ ప్లాన్ ఫలించి నాలుగు కంపెనీలు అతనికి డబ్బు ఇచ్చాయి. అయితే ఒక కంపెనీ జాంగ్ చెబుతోంది అబద్ధం అని ఆలోచించని.. క్లెయిమ్ ఇవ్వడానికి నిరాకరించి.. అతను చెప్పిన అబద్ధాన్ని కనిపెట్టి.. అతని ఆటను బయటపెట్టింది. ఆ తర్వాత అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..