Viral Story:ఫేస్‌బుక్‌ లవ్‌స్టోరీ.. పవన్‌ చేయి పట్టిన ఫారిన్‌ అమ్మాయి.. ఆ తర్వాత..

|

Jan 30, 2023 | 7:37 AM

ఫేస్‌బుక్‌లో స్నేహితులైన తర్వాత క్రిస్టెన్, పవన్ తరచూ వీడియో కాల్స్ ద్వారా కూడా మాట్లాడుకునేవారు. 2012లో ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ పదేళ్ల ప్రేమకథను

Viral Story:ఫేస్‌బుక్‌ లవ్‌స్టోరీ.. పవన్‌ చేయి పట్టిన ఫారిన్‌ అమ్మాయి.. ఆ తర్వాత..
Swedish Woman
Follow us on

ప్రేమ గుడ్డిది అంటారు. కానీ, నిజమైన ప్రేమలో అంధత్వం ఎక్కడా ఉండదు. ప్రేమకు సరిహద్దులు కూడా లేవు, ఎందుకంటే చాలా సందర్భాల్లో దేశాలు దాటుకుని ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. కొన్ని ప్రేమకథలు కేవలం హాయ్, బాయ్‌తో ముగుస్తాయి. కానీ, కొందరు ప్రేమికులు ప్రేమించిన వారికోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. త్యాగాలు చేస్తారు. ఇక నేటి డిజిటల్ యుగంలో ఆసక్తికరమైన ప్రేమ కథలు దేశాలు, ఖండాంతరాలు దాటుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ప్రేమించిన యువకుడి కోసం ఓ విదేశీ యువతి తన దేశం వదిలి వెళ్లి మరీ పెళ్లి చేసుకున్న అరుదైన ఘటన చోటుచేసుకుంది. అలాంటి అద్భుతమైన ప్రేమకథ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. స్వీడన్‌కు చెందిన క్రిస్టెన్ లైబర్ట్ ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న పవన్ కుమార్‌తో వివాహం చేసుకోవడానికి నేరుగా భారతదేశానికి చేరుకుంది. వారి ఆసక్తికరమైన ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో నివసిస్తున్న పవన్ కుమార్‌తో క్రిస్టెన్ లైబర్ట్ 2012లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.. కాలక్రమంలో వీరి స్నేహం ప్రేమగా మారింది. పవన్ కుమార్‌ను పెళ్లి చేసుకోవడానికి క్రిస్టెన్ స్వీడన్ నుండి ఇండియాకు వచ్చింది. పెళ్లి చేసుకునేందుకు స్వీడన్ నుంచి వచ్చిన క్రిస్టెన్ ను చూసి ఇటావా వాసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పదేళ్ల క్రితం వీరి ప్రేమకథ మొదలైంది. పవన్, క్రిస్టెన్‌ల నిజమైన ప్రేమకు స్థానికులంతా అభినందనలు కురిపించారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన పవన్‌తో వివాహం చేసుకోవడానికి క్రిస్టెన్ ఉత్తరప్రదేశ్ రావటంతో ఈ జంట ఇటావాలోని హిందూ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రేమికుల పెళ్లి ఫోటోలను ANI ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఫేస్‌బుక్‌లో స్నేహితులైన తర్వాత క్రిస్టెన్, పవన్ తరచూ వీడియో కాల్స్ ద్వారా కూడా మాట్లాడుకునేవారు. 2012లో ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ పదేళ్ల ప్రేమకథను తమ గుండెల్లో పెట్టుకుని ఆగ్రాలోని తాజ్ మహల్ చూసేందుకు వెళ్లిన ఈ జంట.. ప్రేమకు ప్రతీక అయిన తాజ్ మహల్ ను చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరి పెళ్లి పోస్ట్‌ను ఏఐ ట్వీట్ చేసింది.

పిల్లల ఆనందంలోనే అసలైన ఆనందం ఉందని వారి తల్లిదండ్రులు కూడా సంతోషంగా పెళ్లికి అంగీకరించారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపించారు. స్వీడన్‌కు చెందిన క్రిస్టెన్ లైబర్ట్ మాట్లాడుతూ తాను ఇంతకు ముందే ఇండియాకు వచ్చానని చెప్పింది. భారతదేశాన్ని తాను చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది. భారతీయ వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..