Viral: ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోడికి దొరికినంత.. ఫ్రీగా తెచ్చేసుకుంటున్న జనం.!

|

May 13, 2024 | 12:01 PM

భూప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. భూమిపై మనిషి మనుగడకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇక పాయింట్‌కి వచ్చేస్తే.. మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. అదెక్కడుందో మీకు తెలుసా.? ఏంటి.. అవునా.! అని ఆశ్చర్యపోతున్నారా..

Viral: ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోడికి దొరికినంత.. ఫ్రీగా తెచ్చేసుకుంటున్న జనం.!
Representative Image
Follow us on

భూప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. భూమిపై మనిషి మనుగడకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇక పాయింట్‌కి వచ్చేస్తే.. మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. అదెక్కడుందో మీకు తెలుసా.? ఏంటి.. అవునా.! అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమండీ.! జార్ఖండ్‌లోని సుబర్ణరేఖ నది అని ఒకటుంది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఒడిశా గుండా ప్రవహిస్తోంది. దాదాపు 474 కిమీ పొడవున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం దాగుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఇది తెలిసిన వార్తే. కానీ మిగిలిన వారికి మాత్రం షాకింగ్ విషయం.

ఈ నదిలో నీటి ద్వారా వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికితీసి.. వాటితో తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. ఈ సువర్ణరేఖ నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువులను జల్లెడపడుతున్నారు. ఇప్పటివరకు ఈ నదిలో బంగారం ఎక్కడ నుంచి వస్తోందన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యమే. కొందరైతే.. బంగారంతో కూడిన రాళ్లపై నీరు ప్రవహిస్తోంది కాబట్టే.. బంగారు రేణువులు నదిలో ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. కానీ ఇంతవరకూ దానికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఈ రహస్యాన్ని చేధించేందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం రెండు వేర్వేరు సంస్థలకు బాధ్యతలను అప్పగించగా.. నది ప్రవహిస్తున్న గుండా ఎలాంటి గని కనుగొనలేకపోయాయి ఆ సంస్థలు. కాగా, వర్షాకాలం తప్పితే.. మిగిలిన అన్ని కాలాల్లోనూ ఆ ప్రాంతం ప్రజలు నదిలోని ఇసుకను జల్లెడపట్టి బంగారాన్ని వెలికితీస్తారు. వారికీ దొరికే బంగారం బియ్యం, ధ్యానం కంటే చిన్నగా ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించినా.. ప్రజలు వాటిని పట్టించుకోవట్లేదు.