Watch: అమ్మోరి జాతరలో తాగి ఎంజాయ్‌ చేసిన ఎస్సై.. డ్యూటీలో డ్యాన్స్‌ ఏంటంటూ అధికారుల వేటు..

|

Apr 06, 2023 | 3:03 PM

రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.  ఎస్సై డ్యాన్స్ చూసిన అక్కడి భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.  ఎస్‌ఐ షాజీ డ్యాన్స్‌ చేస్తుండగా స్థానికులు కొందరు వీడియోలు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.

Watch: అమ్మోరి జాతరలో తాగి ఎంజాయ్‌ చేసిన ఎస్సై.. డ్యూటీలో డ్యాన్స్‌ ఏంటంటూ అధికారుల వేటు..
Si Dancing At Temple
Follow us on

విధి నిర్వహణలో మద్యం సేవించి,స్థానికులతో కలిసి డ్యాన్స్‌ చేసినందుకు ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. స్పెషల్ బ్రాంచ్ నివేదిక ఆధారంగా ఎస్పీ శాంతన్‌పర ఎస్‌ఐకేపీ షాజీని సస్పెండ్ చేశారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కిలో చోటు చేసుకుంది. ఇడుక్కిలోని పూప్పర మరియమ్మన్ ఆలయంలో పండుగ సందర్భంగా మద్యం మత్తులో డ్యాన్స్‌ చేసిన ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. శాంతన్‌పర ఎస్‌ఐకేపీ షాజీని సస్పెండ్ చేశారు.

ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని ఇడుక్కి ఎస్పీకి స్పెషల్ బ్రాంచ్ నివేదిక ఇచ్చింది. ఎస్‌ఐ షాజీ అతని బృందం ఉత్సవాల భద్రతా విధుల కోసం ఆలయానికి చేరుకున్నారు. ఇంతలో ఆలయంలోని మైక్ సెట్ నుంచి ‘మరియమ్మ కాళియమ్మ’ అనే తమిళ పాట వినిపించడంతో ఎస్సై ఆగలేకపోయాడు. రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.  ఎస్సై డ్యాన్స్ చూసిన అక్కడి భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఐ షాజీ డ్యాన్స్‌ చేస్తుండగా స్థానికులు కొందరు వీడియోలు తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..