Watch Video: గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశపడుతుంటారు. ఇందుకోసం ఎంత సాహసాన్ని అయినా చేయడానికి వెనుకడుగు వేయరు. కొన్ని సందర్భాల్లో ఇందుకోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. తాజాగా టర్కీకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి అరుదైన ఫీట్‌ను చేసి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకోవడంతో పాటు అందరి ప్రశసంలు పొందారు. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన డారియో కోస్టాకు విమానంతో విన్యాసాలు చేయడం అలవాటు. తన హాబీ ద్వారానే గిన్నిస్ స్థానంలో సంపాదించుకోవాలనుకున్న డారియో ఇందుకోసం ఓ పెద్ద సాహసానికి తెర తీశాడు.
టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న 2.6 కిలోమీటర్ల పొడవున్న రెండు సొరంగాల్లో విమానం నడిపి డారియో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే విమానం రోడ్డుపై వెళ్లిందనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే డారియో విమానాన్ని సొరంగంలో కూడా భూమిపై నుంచి కొంత ఎత్తులో నడిపించారు. విమానం ఏమాత్రం పక్కకు జరిగినా.. పైకి లేచినా పెద్ద ప్రమాదం జరిగేది. ఇలా 2.6 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో ఆ విమానం ఏకంగా గంటకు 245 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం మరో విశేషం. అత్యంత పొడవైన టన్నెల్ గుండా విమానాన్ని నడపడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఇలా ఇంత వేగంతో అద్భుత ఫీట్‌ను సాధించారు కాబట్టే డారియో గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. డారియో సాహసానికి నెటిజన్లు వావ్ అంటున్నారు. మరి ఈ వండర్ ఫుల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read: Good News: అన్నదాతలకు గుడ్ న్యూస్.. రబీ పంటలకు మద్దతు ధరపై మోడీ సర్కార్ కీలక ప్రకటన!
భార్యాభర్తల సంబంధం కలకాలం ఉండాలంటే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే..!