అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కొన్నిసార్లు అదృష్టం అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మారుతుంది. ఊహించని విధంగా మీ ఇంటి తలుపు తడుతుంది. సరిగ్గా ఇలాంటిదే ముగ్గురు విద్యార్థులకు కూడా జరిగింది. కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంటి కోసం కొన్న పాత సోఫా వారిని లక్షాధికారులుగా మార్చేసింది. ఆ ముగ్గురు తమను వరించిన ఆ అదృష్టాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడా పోస్ట్ తీవ్రంగా వైరల్ అవుతోంది. పూర్తివివరాల్లోకి వెళితే..
న్యూయార్క్‌లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కలిసి ఒకే చోట ఉండేందుకు కొత్తగా అద్దె ఇంట్లోకి మారారు. ముగ్గురూ కలిసి కొత్త ఇంటికి చాలా వస్తువులు కొన్నారు. అందులో చాలా వస్తువులు సెకండ్ హ్యాండ్‌వే తీసుకున్నారు. చివరకు సెకండ్ హ్యాండ్ సోఫా కొనాలని నిర్ణయించుకున్నారు. చవకైన సెకండ్ హ్యాండ్ సోఫా కోసం వెతుకుతుండగా.. చివరకు రూ.1300కి పాత సోఫా ఒకటి దొరికింది. అది ఎంతపాత సోఫా అంటే.. దాని నుంచి వచ్చే వాసన భరించలేనంతగా ఉంది. అయినా సరే ఇంటికి సోఫా తెచ్చిన ఒక రోజు తర్వాత.. ముగ్గురు స్నేహితులు కలిసి హాయిగా కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలోనే సోఫా ఆర్మ్‌రెస్ట్‌లో ఏదో చేతికి తగిలినట్టుగా అనిపించింది. అదేంటని వారు వెతకగా వారికి ఒక కవరు దొరికింది. అది ఓపెన్ చేసిన చూడగా వారికి షాక్ తగిలినంత పనైంది..
సోఫాలో దొరికిన కవర్‌లో ఏముందో చూసిన వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. కవరల్ నోట్ల కట్టలు కనిపించాయి. అందులో రూ.34 లక్షలు ఉన్నాయి. ఒక్కసారిగా వచ్చి పడిన డబ్బులు ఆ ముగ్గురు మిత్రులు సంబరపడిపోయారు. అయితే, ఇక్కడ మరో విషయం ఏంంటే.. ఈ డబ్బుతో పాటు ఒక కవరు కూడా ఉంది. డబ్బుకు సంబంధించి 91 ఏళ్ల వితంతువు పేరు, చిరునామా రాసివుంది. అది చూసిన ఆ ముగ్గురు పేపర్‌లోని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారు. సంబంధిత మహిళను గుర్తించి రూ. 34 లక్షలు తిరిగి ఆమెకు ఇచ్చేశారు. ఆ డబ్బును సుమారు ముప్పై ఏళ్లుగా సోఫాలోనే ఉందని తెలిసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావడంతో వృద్ధ మహిళ సంతోషపడింది. నిజాయితీకి తనకు డబ్బులు అప్పగించిన విద్యార్థులకు 1000 డాలర్లు (సుమారు రూ. 83,900)బహుమతిగా ఇచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..