వార్నీ ఇదెక్కడి వింత..! ఖరీదైన కార్లు, స్కూటర్లపై వచ్చిన దొంగలు.. చీప్‌గా ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కే..!

పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అయాన్, యోగేంద్ర, మొహ్సిన్, ఉమర్‌లను అరెస్టు చేసి 8 మేకలను స్వాధీనం చేసుకున్నారు. ఒక మేక ఇంకా కనిపించకుండా పోయింది. ఇంకా ఆచూకీ దొరకలేదు. కానీ, ఇలా గ్రామాల్లో రసగుల్లాలు, మేకల నుండి ఉప్పు బస్తాల వరకు జరిగిన ఈ వింత దొంగతనాల పరంపర శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. 

వార్నీ ఇదెక్కడి వింత..! ఖరీదైన కార్లు, స్కూటర్లపై వచ్చిన దొంగలు.. చీప్‌గా ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే అవాక్కే..!
Strange Theft

Updated on: May 12, 2025 | 3:58 PM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వింత దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. అసాధారణ వస్తువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు దోపిడీ దొంగలు. వాటిలో రసగుల్లాలు, మేకలు, ఉప్పు బస్తాలను కూడా వదలకుండా ఎత్తుకెళ్తున్నారు. దొంగలు. ఇక్కడ మరింత ఆశ్చర్యకర విషయం ఏంటంటే… దొంగలు ఈ నేరం చేయడానికి స్కూటీని ఉపయోగించారని సమాచారం. గఢా ప్రాంతంలో ఒక స్కూటర్‌పై వచ్చిన దొంగలు ఉప్పు బస్తాను ఎత్తుకెళ్లారు. రెండవ సంఘటన కొత్వాలి ప్రాంతంలో జరిగింది. అక్కడ ఒక ఈ-బైక్ నుండి సిగరెట్లు, జీలకర్రతో నిండిన సంచి దొంగిలించారు. ఈ దొంగతనం సంఘటన దుకాణం బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వింత దొంగతనాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

సెహోర్‌లో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బేకరీ దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణదారుడు ఏదో పరధ్యానంలో ఉండగా, వారిలో ఒకరు రసగుల్లా బాక్స్‌ మొత్తాన్ని ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. అంతేకాదు.. దానికి బోనస్‌గా గుట్కా పౌచ్‌ను కూడా తీసుకున్నారు. దొంగతనం మొత్తం ఖర్చు రూ. 125లు. కానీ నైతిక నష్టం గణనీయంగా ఉంది. చట్టం దానిని నేరంగా కాకుండా నైతిక లోపంగా పరిగణించినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దేవ్‌తాల్‌లో తెల్లటి యాక్టివా స్కూటర్‌పై వెళుతున్న ఒక దొంగ జైపాల్ ప్రజాపతి దుకాణం నుండి రూ. 1000 విలువైన 5 బస్తాల ఉప్పును దొంగిలించాడు. పిజ్జా ఆర్డర్ తీసుకుంటున్నట్లుగా వచ్చిన ఆ దొంగ ఎవరూ గమనించని సమయంలో స్కూటర్ పై ఉప్పు బస్తా వేసుకుని అక్కడ్నుంచి పారిపోయాడు.

ఇవి కూడా చదవండి

లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న నలుగురు దొంగలు అధర్తల్ నుండి తొమ్మిది మేకలను దొంగిలించారు. యజమాని హేమంత్ రజక్ ఉదయం నిద్రలేచి చూసేసరికి షెడ్ ఖాళీగా ఉండటంతో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అయాన్, యోగేంద్ర, మొహ్సిన్, ఉమర్‌లను అరెస్టు చేసి 8 మేకలను స్వాధీనం చేసుకున్నారు. ఒక మేక ఇంకా కనిపించకుండా పోయింది. ఇంకా ఆచూకీ దొరకలేదు. కానీ, ఇలా గ్రామాల్లో రసగుల్లాలు, మేకల నుండి ఉప్పు బస్తాల వరకు జరిగిన ఈ వింత దొంగతనాల పరంపర శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (గ్రామీణ) సూర్యకాంత్ శర్మ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకున్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు. కానీ, 5,000 కంటే తక్కువ దొంగతనం జరిగితే దానిని గుర్తించలేని నేరంగా పరిగణిస్తారని చెప్పారు.  బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ  దానిని ‘ఆడమ్ చెక్’ (నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్)గా పరిగణిస్తారని చెప్పారు. ఫిర్యాదుదారుడు నేరుగా కోర్టును సంప్రదించాలని సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..