Pawan Kalyan: దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాల్లో కొలువుదీరి.. 9 రోజుల పాటు పూజలను అందుకోవడానికి వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి. బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా.. వినాయక మందిరంలో ప్రతిష్టించే వినాయక విగ్రహాల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తమకు నచ్చిన మెచ్చిన వ్యక్తులకు గణేశుడి రూపాన్ని ఇచ్చి.. మండపంలో ప్రతిష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఓ మండపంలో ప్రతిష్టించే గణపతి ప్రతిమను పవన్ కళ్యాణ్ లా తయారు చేయించారు కొంతమంది జనసైనికులు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
అందరి హీరోలకు అభిమానాలుంటారు.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారన్న సంగతి తెలిసిందే. హిట్ ప్లాప్ లతో సంబంధంలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి.. రాజకీయ నేతగా మారారు. గత కొంతకాలంగా ఏపీలోని ప్రజల సమస్యలపై పోరాడుతూ.. తన నిరసన గళం వినిపిస్తున్నారు. ఇటీవల ఏపీలోని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా.. జనసేనాని.. కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. అనంతరపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లోని కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని అందించారు. దీంతో బాధిత కుటుంబాలను అండగా తాము ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం జనసైనికులు బాధిత కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ చెక్కు ఇస్తున్న దృశ్యంతో వినాయక ప్రతిమను చేయించారు. సాటి మనిషి కష్టంలో నిలబడే మానవత్వం ఉన్న ప్రతి హృదయం దైవంతో సమానం.. అందులో మా నాయకుడు మానవత్వపు మహాశిఖరం అని అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు తన అభిమానాన్ని చాటుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..