Viral: ఆ ఇంటి గోడల నుంచి వింత శబ్దాలు.. పగలగొట్టి చూసి ఒక్కసారిగా భయంతో.!

|

Jul 10, 2023 | 8:00 AM

సాధారణంగా ఒక్క పామును చూస్తేనే.. మన ఒళ్లంతా జలదరిస్తుంది. అలాంటిది ఒకే చోట కుప్పలు తెప్పలుగా పాములు బయటపడితే.. ఇంకేమైనా ఉందా.!

Viral: ఆ ఇంటి గోడల నుంచి వింత శబ్దాలు.. పగలగొట్టి చూసి ఒక్కసారిగా భయంతో.!
Representative Image
Follow us on

సాధారణంగా ఒక్క పామును చూస్తేనే.. మన ఒళ్లంతా జలదరిస్తుంది. అలాంటిది ఒకే చోట కుప్పలు తెప్పలుగా పాములు బయటపడితే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ ఇంటి యజమానికి ఎదురైంది. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక రోహ్తాస్ సిటీకి సమీపంలో ఉన్న అగ్‌రోఢ్‌ ఖుర్ద్‌ గ్రామంలోని ఓ ఇంటిలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 నుంచి 60 పాములు బయటపడటం సంచలనాన్ని సృష్టించింది. తరచూ ఇంటి గోడల నుంచి వింత శబ్దాలు వస్తుందేవని.. మూలల నుంచి ఒక్కొక్కటిగా పాము దర్శనమివ్వడం.. వాటిని చంపుతూ వచ్చానని.. సుమారు 24కిపైగా పాములు చంపానని.. అయినా ఆ సంఖ్య పెరుగుతూ పోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా ఆ ఇంటి యజమాని కృపానారాయణ్ తెలిపారు.

దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సహాయక బృందాలతో కలిసి గురువారం ఆ ఇంటి గోడలు, ఫ్లోరింగ్‌ పగలగొట్టగా సుమారు 30 పాములు బయటపడ్డాయి. వాటిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు. అవన్నీ కూడా నాగుపాము జాతికి చెందినవిగా అధికారులు చెబుతున్నారు. కాగా, తన రెండంతస్తుల ఇంటిని సుమారు 65 ఏళ్ల క్రితం కట్టినట్టుగా యజమాని కృపానారాయణ్ పేర్కొన్నాడు.