AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మరీ ఇలా తయారయ్యారేంటి.. ఆఖరికి డాక్టర్‌ను కూడా వదల్లేదా..

కరోనా పుణ్యమా అని డబ్బులు చేతులు మారడం తక్కువైపోయాయి. దానికి బదులుగా నగదు చెల్లింపులు అమలులోకి వచ్చేశాయి. ఇక నోట్లు ఇవ్వడం తగ్గిపోవడంతో..

Viral: మరీ ఇలా తయారయ్యారేంటి.. ఆఖరికి డాక్టర్‌ను కూడా వదల్లేదా..
Viral 1
Ravi Kiran
|

Updated on: Jul 10, 2023 | 8:39 AM

Share

కరోనా పుణ్యమా అని డబ్బులు చేతులు మారడం తక్కువైపోయాయి. దానికి బదులుగా నగదు చెల్లింపులు అమలులోకి వచ్చేశాయి. ఇక నోట్లు ఇవ్వడం తగ్గిపోవడంతో.. వచ్చే అరకొర వాటిని పెద్దగా పరిశీలించడం మానేశారు యజమానులు. దీంతో ఓ రోగి ఏకంగా వైద్యుడినే బోల్తా కొట్టించాడు. నకిలీ నోటు ఇచ్చి ఎంచక్కా వైద్యం చేయించుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత అది నకిలీ నోటు అని తెలుసుకున్న వైద్యుడు ఖంగుతిన్నాడు. ఇక ఈ విషయాన్ని ఆ డాక్టర్ ఇంటర్నెట్‌లో నెటిజన్లతో పంచుకున్నాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది. అయితే, అది నకిలీ నోటు అని ఆ పేషెంట్ కు కూడా తెలిసి ఉండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని డాక్టర్ మానవ్ అరోరా తన పోస్టులో వివరించారు.

డాక్టర్ మానవ్ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్ గా రోగులకు సేవలందిస్తున్నారు. ఇటీవల ఆయన దగ్గరికి వచ్చిన ఓ రోగి కన్సల్టేషన్ ఫీజు కింద 500 రూపాయల నోటు ఇచ్చాడు. ఆ సమయంలో రిసెప్షనిస్ట్ నోటును పరిశీలించకుండానే తీసుకుంది. ఆ తర్వాత రోగికి డాక్టర్ వైద్యం చేసి.. మందులు ఇవ్వడం అయిపోయింది. అనంతరం అతడు వెళ్లిపోయాడు. ఇక తన షిఫ్ట్ అయ్యాక డాక్టర్ తనకొచ్చిన డబ్బులు లెక్కపెడుతుండగా.. ఓ ఫేక్ 500 నోటును గుర్తించాడు. రెండు ముక్కలు అతికించి ఉన్న నోటును చూసి చాలా నవ్వుకున్నానని.. ఇది తనకు ఓ ఫన్నీ మెమరీగా ఉండిపోతుందన్నారు. దీన్ని అతడు నెటిజన్లతో పంచుకోగా.. ఇలా జరిగినందుకు బాధపడాలా.? జాలిపడాలా.? అని కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Post by @dr.mananvora
View on Threads

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?