Viral Video: నీళ్ల కోసం బావిని తవ్వుతుండగా కళ్లు మిరుమిట్లుగొలిపే సీన్.. ఏముందా అని చూడగా

ఓ వ్యక్తి నీళ్ల కోసం తన ఇంటి సమీపాన బావి తవ్వుతున్నాడు. అతడికి అనుకోని విధంగా ఓ పెద్ద రాయి తగిలింది. అదేంటో అని చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. కళ్లకు మిరమిట్లు గొలుపుతూ అతడికి కనిపించింది ఏంటో తెలిస్తే దెబ్బకు షాక్ అవుతారు.. ఆ వివరాలు..

Viral Video: నీళ్ల కోసం బావిని తవ్వుతుండగా కళ్లు మిరుమిట్లుగొలిపే సీన్.. ఏముందా అని చూడగా
Viral News

Updated on: Nov 28, 2025 | 12:30 PM

అదృష్టం ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడుతుందో.. ఎవ్వరూ చెప్పలేరు. ధనవంతుడి చెంత మాత్రమే కాదు.. పేదవాడి చెంత కూడా అదృష్టం ఉంటుందని చెప్పే ఘటనలు చాలానే జరిగాయి. నిత్యం పేదవాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. కొందరికి లాటరీలో డబ్బులు తగిలి కోటీశ్వరులు అయితే.. మరికొందరికి బంగారు నాణేలు దొరికి కుబేరులు అవుతున్నారు. ఇంతకీ ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాం అంటే.! ఓ వ్యక్తి ఇలాగే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. బావి తవ్వుతుండగా మెరుస్తూ ఒకటి కనిపించింది అదేంటని చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్ళు గడుస్తున్నా ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలోని ఓ వ్యక్తి తన ఇంటి సమీపాన నీటి కోసం బావి తవ్వుతున్నాడు. ఇక అతడికి సగం తవ్వగానే మట్టిలో ఓ పెద్ద రాయి మెరుస్తూ కనిపించింది. అదేదో మాములు రాయి అని పక్కన పడేశాడు. అయితే ఇంకా అతడికి ఆ రాయి నుంచి కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతులు కనిపిస్తుండటంతో అనుమానమొచ్చి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు సంఘటనాస్థలానికి చేరుకొని దాన్ని పరిశీలించగా దెబ్బకు షాక్ అయ్యారు. అది సాధారణ రాయి కాదు.. ప్రపంచంలోనే అరుదైన సాఫైర్ స్టోన్(Sapphire Stone)గా గుర్తించారు. అదొక పెద్ద నీలమణి రాయి అని.. దాని బరువు దాదాపుగా 2.5 మిలియన్ క్యారెట్లు.. అనగా 510 కిలోలు ఉన్నట్టు చెప్పారు. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం దాని విలువ సుమారు రూ. 100 మిలియన్ డాలర్లుగా తెలిపారు. మరోవైపు శ్రీలంకకు సంబంధించిన రేర్ మెటల్స్ అధికారులు కూడా ఈ రాయిని పరిశీలించారు. ఈ రాయి ప్రపంచంలోనే అతిపెద్ద నక్షత్ర నీలమణిగా పేర్కొన్నారు. కాగా, ఈ రాయి ఆరు కిరణాల నక్షత్రంగా మెరుస్తుంది. రాయికి రెండు వైపులా నక్షత్రం లాంటి ఆకారం ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి