Photo Puzzle: మీ ఐ పవర్ ఏ రేంజిదంటే.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె..!

హాట్ హాట్ సమ్మర్‌లో.. మిమ్మల్ని కూల్ చేసే ఫోటో పజిల్‌ తీసుకొచ్చేశాం. మీ బుర్రను.. మీ చూపునకు పదునుపెట్టే తికమక పజిల్.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల ఫోటో పజిల్స్ ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో ఒకటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. ఇవి ప్రజల కాలక్షేపానికి మాత్రమే కాదు..

Photo Puzzle: మీ ఐ పవర్ ఏ రేంజిదంటే.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తోపులెహె..!
Photo Puzzle 1

Updated on: May 06, 2024 | 6:30 PM

హాట్ హాట్ సమ్మర్‌లో.. మిమ్మల్ని కూల్ చేసే ఫోటో పజిల్‌ తీసుకొచ్చేశాం. మీ బుర్రను.. మీ చూపునకు పదునుపెట్టే తికమక పజిల్.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల ఫోటో పజిల్స్ ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో ఒకటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. ఇవి ప్రజల కాలక్షేపానికి మాత్రమే కాదు.. మెదడు పనితీరును కూడా మెరుగుపరిచేందుకు పనికొస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలపై నెటిజన్లకు విపరీతమైన ఆసక్తి ఉంది. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిరుత నెటిజన్లతో హైడ్ అండ్ సీక్ ఆడుతోంది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీముందు ఉన్న టాస్క్. సరిగ్గా చూస్తే ఆ చిరుతను కనిపెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే, ఇందుకోసం మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చూపునకు కాస్త పదునుపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు గానీ ఆ చిరుతను కనిపెట్టడం సాధ్యపడదు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఫోటోలో దాక్కున్న చిరుతను పసిగట్టేయండి. మీ బ్రెయిన్ పనితీరును, కంటి చూపును మెరుగుపరుచుకోండి. ఎంత వెతికినా ఆ చిరుత కనిపించలేదా? మరేం పర్వాలేదు. చిరుత ఎక్కడుందో కింద ఫోటోలో మార్క్ చేసి చూపించాం. అందులో ఆ హిడెన్ చిరుతను చూసేయండి.