Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!

మీ కళ్ళు ఎంత షార్ప్‌గా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదే సరైన టైమ్. ఈసారి ఆప్టికల్ ఇల్యూజన్‌లో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. మీరు చూస్తున్న ఈ చిత్రాన్ని ఒకసారి గమనించండి. అక్కడ మీకు అన్నీ 78 నెంబర్లే కనిపిస్తాయి. కానీ వాటి మధ్యలో ఎక్కడో ఒకచోట 87 నంబర్ దాగివుంది. ఆ నెంబర్‌ ను కేవలం 6 సెకన్లలో గుర్తించాలి. ఇది మీ దృష్టి వేగాన్ని, స్పష్టతను పరీక్షించే ఒక ఛాలెంజ్ అని చెప్పవచ్చు. మరి రెడీనా..? వెంటనే చూసి ప్రయత్నించండి.

Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion

Updated on: May 21, 2025 | 8:18 PM

ఆప్టికల్ ఇల్యూజన్ మన చూపును మాయ చేసే ఒక విజువల్ ట్రిక్. మనం ఒకటి చూస్తే మెదడు ఇంకోలా అర్థం చేసుకుంటుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ మాయాజాలం మన కళ్ళు, మెదడు మధ్య సమన్వయాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. అందుకే మనకు వాస్తవానికి భిన్నంగా ఏదైనా కనిపించవచ్చు.

చిత్రాల్లో ఉండే గీతలు, రంగులు, వెలుతురు, నీడలు ఇవన్నీ కలిసి మన చూపును తప్పుదోవ పట్టిస్తాయి. కొన్నిసార్లు కదలని బొమ్మలు కదులుతున్నట్లు కనిపించవచ్చు. నేరుగా ఉన్న గీతలు వంకరగా అనిపించవచ్చు. ఇది చాలా సార్లూ మన మెదడు చూపిన దృశ్యాన్ని ఎలా విశ్లేషిస్తుందో దాని ఆధారంగా జరుగుతుంది.

 

ఇప్పుడు మన టాస్క్ విషయానికి వెళ్దామా.. మీరు చూస్తున్న ఈ 6 సెకన్ల ఛాలెంజ్ బయటకి చూసినప్పుడు చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ఇది అంత ఈజీ మాత్రం కాదు. ఈ చిత్రాన్ని చూస్తే పూర్తిగా 78 నంబర్లతో నిండి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఒకే విధంగా ముద్రించబడి ఉండటంతో మన మెదడు వాటిని గ్రూపులుగా గుర్తిస్తుంది.

అయితే ఈ 78ల మధ్య దాగి ఉన్న 87 నెంబర్ మన దృష్టికి కనబడదు. ఇది చిన్న తేడా అయినా.. దాన్ని గుర్తించడానికి చాలా ఎక్కువ ఏకాగ్రత, పరిశీలనా శక్తి అవసరం. ఎందుకంటే 87 నెంబర్‌లో ఉండే అంకెలు కూడా 7, 8 కాబట్టే.. అవి 78లతో కలిసి మమేకమై పోతాయి. అలాంటి సమయంలో మన మెదడు సహజంగా దాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది.

మీరు ఈ ఛాలెంజ్‌ ని 6 సెకన్లలో పూర్తి చేయగలిగితే.. మీ దృష్టి సామర్థ్యం నిజంగా అపూర్వంగా ఉందని అర్థం. ఇది ఒక సరదా పరీక్ష మాత్రమే కాదు, మీరు మీ దృష్టి చురుకుదనాన్ని, మెదడు పనితీరును పరీక్షించుకునే మంచి మానసిక వ్యాయామం కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం..? మీరు 87 నెంబర్‌ ను గుర్తించారా..? గుర్తించి ఉంటే మీకు అభినందనలు. గుర్తించలేకపోతే చింతించకండి. మీకోసం నేను సర్కిల్ చేసి ఉంచాను వెళ్లి చూడండి. సర్కిల్ లో మీరు వెతుకుతున్న నెంబర్ ఉంది.