Optical Illusion: వాసివాడి తస్సాదియ్యా.. ఈ ఫోటోలో దాగున్న పక్షిని కనిపెడితే మీలో దమ్మున్నట్లే!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మీ మెదడుకు ఎప్పుడూ పని చెబుతుంటాయి. వీటిని సాల్వ్ చేయడంలో కొందరికి మాంచి కిక్కొస్తుంది.

Optical Illusion: వాసివాడి తస్సాదియ్యా.. ఈ ఫోటోలో దాగున్న పక్షిని కనిపెడితే మీలో దమ్మున్నట్లే!
Optical Illusion

Updated on: Jan 16, 2023 | 6:50 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మీ మెదడుకు ఎప్పుడూ పని చెబుతుంటాయి. వీటిని సాల్వ్ చేయడంలో కొందరికి మాంచి కిక్కొస్తుంది. మీకు డేగలాంటి కళ్లు ఉండటమే కాదు.. మెదడు కూడా చురుగ్గా ఉంటేనే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లోని రహస్యాలను కనిపెట్టగలం. ఈరోజుల్లో ఇంటర్నెట్‌లో ఇలాంటి ఫోటో పజిల్స్ కోకొల్లలు. ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడంలో నెటిజన్లు భలే ఆసక్తిని కనబరుస్తారు. మరి లేట్ ఎందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం పని పడదాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా..? దాన్ని చూడగానే అక్కడున్నవి చెక్క ముక్కలని అందరూ చెప్పగలరు. అయితే ఆ చెక్కల మధ్యలో ఓ పక్షి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మీకున్నది కేవలం 10 సెకన్లు మాత్రమే.. ఆ పక్షిని గుర్తించాలి. ఫోటోను తీక్షణంగా చూస్తే మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తించగలరు. ట్రై చేయండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.