Sportsmanship: క్రీడలో గెలిచినా.. ఓడినా క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరం. అయినా గ్రౌండ్ లో దిగితే అవతలి టీమ్ ని ప్రత్యర్థిగానే చూస్తారు. గెలుపోటములను పక్కనపెట్టి క్రీడాస్ఫూర్తిని చాటే సందర్భాలు అరుదుగా చూస్తుంటాం.. అలాంటి అరుదైన సంఘటన బేస్ బాల్ సౌత్ వెస్ట్ రీజియన్ ఛాంపిచన్ షిప్ లో చోటచేసుకుంది. ఈ వీడియో అందరి మనస్సులను దోచుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే. టెక్సాస్ ఈస్ట్, ఓక్లహోమా మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ఓక్లహోమా హిట్టర్ ఇసయ్య జే జార్విస్ కు టెక్సాస్ ఈస్ట్ బౌలర్ (పిచ్చర్) కైడెన్ షెల్టాన్ ఎంతో వేగంగా వేసిన బంతి తలపై తగిలింది. దీంతో ఇసయ్య జే జార్విస్ తల పగలడమే కాదు..తలపై ఉన్న హెల్మెట్ కింద పడిపోయింది. బాల్ తగిలిన దెబ్బకు బ్యాటర్ కాసేపు బాధపడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. ఆతర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. బాల్ వేయడానికి పిచ్చర్ బాధపడుతూ.. తనలో తాను మదనపడుతున్నాడు. తాను వేసిన బాల్ తగిలి ఎంతపనయ్యిందో అంటూ కైడెన్ షెల్టాన్ తలపై చెయ్యి పెట్టుకుని బాధపడ్డాడు. ఇది చూసిన నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ఇసయ్య జే జార్విస్ పిచ్చర్ దగ్గరకు చేరుకుని ఓదార్చడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఇద్దరు ఆలింగనం చేసుకుంటూ.. బాధపడకులే అంటూ ఓదార్చాడే. ఇది చూసిన వారంతా క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమంటూ ఇద్దరు క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బేస్ బాల్ లిటిల్ లీగ్ వరల్డ్ సిరీస్ ప్రతి సంవత్సరం కొన్ని అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. వాటిలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చే. క్రీడాకారులు చిన్న వయస్సులోనూ చాటిన క్రీడాస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆటగాళ్లంటే వీరేనని కొందరు.. కొట్టి ఏడుస్తున్నాడే అంటూ మరికొందరు ఈవీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. బేస్ బాల్ సౌత్ వెస్ట్ రీజియన్ ఛాంపిచన్ షిప్ లో టెక్సాస్ ఈస్ట్, ఓక్లహోమా మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ లోచివరికి టెక్సాస్ ఈస్ట్ జట్టు విజయం సాధించింది.
“Hey, you’re doing just great”
Oklahoma little leaguer gets hit in the head and then comforts the pitcher who is shaken up afterward pic.twitter.com/hYYLiy511K
— Jomboy (@Jomboy_) August 9, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..