Viral Video: ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాట‌కు డాన్స్‌‌ చేసి పిచ్చెక్కించిన ఎయిర్‌హోస్టెస్.. సూపర్బ్ అంతే

ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌ ఉమా మీనాక్షి గుర్తుందికదా.. ఆమధ్య 'మానికే మాగే హితే, కచ్చా బాదం' పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

Viral Video: ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాట‌కు డాన్స్‌‌ చేసి పిచ్చెక్కించిన ఎయిర్‌హోస్టెస్.. సూపర్బ్ అంతే
Cabin Crew Dance

Updated on: Mar 27, 2022 | 12:51 PM

Trending Video: ఇండిగో ఎయిర్‌ హోస్టెస్‌ ఉమా మీనాక్షి(air hostess Uma Meenakshi) గుర్తుందికదా.. ఆమధ్య ‘మానికే మాగే హితే, కచ్చా బాదం’ పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి.  ఇప్పుడు తాజాగా మరో పాటకు డాన్స్‌ చేసి మళ్లీ నెటిజన్లను దృష్టికి ఆకర్షించింది. తాజాగా, కృతిస‌న‌న్( Kriti Sanon) డాన్స్‌ చేసిన బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్‌ ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాటకు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియోకూడా నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో మీనాక్షి క్యాబిన్ సిబ్బందితో క‌లిసి యూనిఫాంలో ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాట‌పై డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. ఏఆర్ రెహ‌మాన్ కంపోజ్ చేసిన ఈ పాట‌పై ఎయిర్‌హోస్టెస్ డ్యాన్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు.. లక్షలమంది వీక్షిస్తూ లైక్స్‌తో.. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నెట్టింట ఈ వీడియో ఇప్పుడు దుమ్మురేపుతూ దూసుకుపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ ట్రెండింగ్ వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి….

Also Read:   Hyderabad: ఏప్రిల్ నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే డైరెక్ట్ జైలుకే