Viral Video: ఫ్లైట్‌లో దుమ్ములేపే డ్యాన్స్ చేసిన ఏయిర్ హోస్టెస్.. నెట్టింట వీడియో వైరల్

Air hostess dance video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే..

Viral Video: ఫ్లైట్‌లో దుమ్ములేపే డ్యాన్స్ చేసిన ఏయిర్ హోస్టెస్.. నెట్టింట వీడియో వైరల్
Spicejet Air Hostess Dance

Updated on: Jan 28, 2022 | 6:54 AM

Air hostess dance video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. ఇంకొన్ని మాత్రం ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంటుంది. అలాంటి వీడియో (Viral Video) ల్లో డ్యాన్స్ కు సంబంధించినవి ఎక్కువగానే ఉంటాయి. నెట్టింట ఇటీవల క్యూట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ట్రెండింగ్‌లో ఉన్న బెంగాలీ పాట ‘కచా బాదమ్‌’కు ఒక ఎయిర్ హోస్టెస్ (Air hostess ) డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ హల్చల్ చేస్తోంది.

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఎయిర్ హోస్టెస్ కనిపించింది. స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి.. లేజీ లాడ్‌పై డ్యాన్స్ చేసిన మునుపటి వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా.. ఓ కొత్త క్లిప్‌ను ఆమె పోస్ట్ చేయడంతో..నెటిజన్లు దీనిని తెగ ఇష్టపడుతున్నారు. కొత్త వీడియోలో ఉమా ఖాళీ విమానంలో ట్రెండింగ్‌లో ఉన్న బెంగాలీ పాట కచా బాదంకి డ్యాన్స్ చేస్తోంది. ట్రెండ్‌లో నడుస్తున్న ఈ ఛాలెంజ్ ఇప్పుడు ఉమ కూడా అద్భుతంగా చేసి నెటిజన్లను ఆకట్టుకుంది.

కచా బాదం సాంగ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ ఆడియోగా మారింది. చాలా మంది దీనిని డ్యాన్స్ రీల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ పాటను పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్‌ పాడారు. వీధిలో వేరుశెనగలు అమ్ముతున్నప్పుడు భుబన్ ఈ ప్రత్యేకమైన పాటను పాడడాన్ని ఎవరో రికార్డ్ చేయడంతో అది వైరల్ అయ్యింది. అయితే.. ఈ పాటను ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు రీమెక్‌లు కూడా చేస్తున్నారు.

వైరల్ వీడియో..

ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో కూడా చాలా రియాక్షన్‌లు కనిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో, ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ లోనే రీల్ చేస్తూ కనిపిస్తుంది.

Also Read:

Viral Video: చలి కాచుకుంటున్న కుక్క పిల్లలు.. క్యూట్ వీడియో చూసి నెటిజన్ల ఫిదా..

Crime News: రిపబ్లిక్ డే రోజున పట్టపగలు యువకుడిపై దుండగుల కాల్పులు! స్పాట్‌లోనే..