ఒకే కాన్పులో పదిమంది సంతానానికి జన్మనిచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పానని కట్టుకధ అల్లిన దక్షిణాఫ్రికా మహిళను సైకియాట్రిక్ వార్డులో చేర్చగా సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఒకేసారి పదిమందికి జన్మనిచ్చానని ప్రకటించుకున్న గొసైమ్ థమర సిథోల్ అనే మహిళ వ్యవహారంలో అందరూ ఊహించినట్టే జరిగింది. అందరి అనుమానాలను పటాపంచల్ చేస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అధికారికంగా ఓ నివేదికను వెల్లడించింది. ఆమె, ఆమె భర్త చెప్పింది పచ్చి అబద్దమని చెబుతూ అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం.. మానసిక చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది.
అసలు ఆ మహిళ ఈమధ్య కాలంలో గర్భమే దాల్చలేదనే విషయం వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ మేరకు ఆమెను పరీక్షించిన వైద్యుల నివేదికను అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. అంతేకాకుండా సిథోల్ మానసిక ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మెంటల్ హెల్త్ యాక్ట్ కింద ఆమెను అదుపులోకి తీసుకుని ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. మరోవైపు ఆమె భర్త టెబెహో సోటెట్సిను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే, అలా అసత్య ప్రచారం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలను ఆ మహిళ బయటపెట్టింది. నవజాత శిశువుల పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి..ఎక్కువగా మొత్తంలో డబ్బు సంపాదించాలని తన భర్త ప్లాన్ చేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే గతంలో కూడా ముగ్గురు పిల్లలు పుట్టారని సదరు మహిళ ప్రకటించుకుందని.. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని బంధువులు చెప్పారు. దీంతో ఆ మహిళ డెలివరీ కోసం ఏ ఆస్పత్రిలోనూ చేరలేదని నిర్ధారించుకున్న అధికారులు.. ఆపై ఆమె కట్టుకథను ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇక ఇదంతా ఫేక్ అని తేలడంతో.. మాలి దేశంలో మే నెలలో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన హలీమా సిస్సే రికార్డు పదిలంగా ఉందని చెప్పొచ్చు.
Also Read:
ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!
ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!