Viral Video: కల్మషం లేని మనసులు కలిసిన వేళ… వీడియో చూస్తే భావోద్వేగానికి లోనవుతారు

|

Nov 17, 2021 | 10:04 AM

చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పెద్దలు. నిజమే.. వారికి కల్మషం ఉండదు.. పేద, ధనిక తేడాలుండవు. కుల, మతాల గురించి వారికి తెలీదు.

Viral Video: కల్మషం లేని మనసులు కలిసిన వేళ... వీడియో చూస్తే భావోద్వేగానికి లోనవుతారు
Kids Viral Video
Follow us on

చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పెద్దలు. నిజమే.. వారికి కల్మషం ఉండదు.. పేద, ధనిక తేడాలుండవు. కుల, మతాల గురించి వారికి తెలీదు. ఇలా స్వచ్చమైన మనస్సుతో ఉండేవారిని దేవుళ్లు కాక ఏమంటారు. అయితే చిన్న పిల్లలకు సంబంధించి రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అప్పుడే బుడి బుడి అడుగులు వేస్తోన్న మూమెంట్స్, తొలిసారి అమ్మ అని పిలిచిన సందర్భం.. వచ్చీ రానీ మాటలతో కబుర్లు చెప్పడం.. ఇలా రకరకాల వీడియోలు నెట్టింట సర్కులేట్ అవుతుంటాయి.  తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంది. కచ్చితంగా మీ మనసుల్ని గెలుచుకుంటుంది. ఈ పిల్లల్లాగే అందరూ కూడా కల్మషం లేకుండా ఉంటే ప్రకృతి సృష్టించిన ఈ భూమి స్వర్గంలా మారుతుందని మీరే అంటారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి ఎదురగా.. మరొకరు నిలబడి కనిపించడం మీరు చూడవచ్చు. ఆకుపచ్చ టీ షర్టు ధరించిన పిల్లవాడు.. మరో చిన్నోడిని చూసి ఆనందంతో గెంతుతూ కనిపించాడు. ఈ క్రమంలో రంగుల టీ షర్ట్ ధరించిన పిల్లాడు రెండు అడుగులు ముందుకు వేసి ఎదురుగా ఉన్న పిల్లోడిని కౌగిలించుకుంటాడు ఎదురుగా ఉన్న పిల్లవాడు కూడా అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. వీడియోని చూస్తుంటే.. వారిలో ఒకరు పేద వర్గానికి చెందిన పిల్లోడు, మరొకరు కాస్త సంపన్న వర్గానికి చెందిన కిడ్ అని అర్థం చేసుకోవచ్చు. కానీ వారికి అవేమీ తెలియవు. నన్ను నమ్మండి, ఈ వీడియో చూసిన తర్వాత, మీరు ఖచ్చితంగా ఒక క్షణం భావోద్వేగానికి లోనవుతారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను షేర్లు చేస్తూ సర్కులేట్ చేస్తున్నారు. పిల్లలిద్దరూ తమ అమాయకత్వంతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. kiansh_ayansh అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్టోబరు 28న షేర్ చేసిన ఈ వీడియోకు వార్తలు రాసే వరకు 23 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

Also Read: అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి అనుకోని అతిథి.. ఆ పాప కానీ ఏడవకపోయి ఉంటే

‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక