AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు సర్‌ప్రైజ్ చేసేందుకు భర్త మాస్టర్ ప్లాన్.. కొత్త ఐఫోన్ కొనేందుకు ఏం చేశాడంటే?

ప్రియమైన వారికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు చాలా మంది రకరకాలుగా డబ్బు సమకూరుస్తుంటారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కొత్తగా లాంచ్‌ అయిన ఐఫోన్ 18 ప్రోమాక్స్‌ను భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఏకంగా తన బంగారాన్నే అమ్మేసినట్టు తెలిపారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారిపోయింది.

భార్యకు సర్‌ప్రైజ్ చేసేందుకు భర్త మాస్టర్ ప్లాన్.. కొత్త ఐఫోన్ కొనేందుకు ఏం చేశాడంటే?
From Gold Sales To Fiancee Gifts
Anand T
|

Updated on: Sep 19, 2026 | 8:16 AM

Share

ఐఫోన్.. వీటిని ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. మార్కెట్‌లోకి కొత్త మోడల్ వచ్చిందంటే చాలు.. జనాలు కొనేందుకు ఎగబడి పోతుంటారు. తాజాగా ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌ కాగా.. శుక్రవారం నుంచి దేశంలో ఈ సిరీస్ మొబైల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో తెల్లవారుజాము నుంచే ఫోన్స్ కొనేందుకు స్టోర్స్ ముందూ క్యూ కట్టారు జనాలు. అయితే ఆ క్యూలోని మొదటి లైన్‌లో నిల్చుకున్న నోయిడాకు చెందిన ఓ వ్యక్తి చెప్పిన మాటలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

భార్యకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు బంగారం అమ్మిన వ్యక్తి

అవును అతను భార్యకు ఇష్టమైన ఐఫోన్ కొనేందుకు ఏకంగా తన బంగారాన్నే అమ్మేసినట్టు తెలిపారు. అతను మాట్లాడుతూ.. తన భార్యకు ఐఫోన్ 18 ప్రోను బహుమతిగా ఇవ్వాలనుకున్నానని.. అందుకే ఈ రోజు ఫొన్ కొనేందుకు వచ్చానని తెలిపారు.. తన భార్య బర్గండీ కలర్‌లో ఉన్న ఐఫోన్ 18 ప్రో కావాలని అడిగిందని.. అతని భార్య ఇంతకు ముందు ఐఫోన్ వాడలేదని, ఆమెకు ఈ అప్‌గ్రేడ్ ఇవ్వాలనుకున్నానని అతను చెప్పాడు.

ఐఫోన్ 18 ప్రో కోసమే ఎందుకు ఎదురుచూశారు అని అడిగినప్పుడు.. ఈరోజు డబ్బు ఉంది, గతంలో లేదు, భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు, ప్రస్తుతానికి ఈ రోజులో బతుకుతున్నాం అని అతను సమాధానం ఇచ్చాడు. అలాగే ఈ ఫోన్ కొనేందుకు తాను తన బంగారాన్ని అమ్మినట్లు అతను చెప్పుకొచ్చాడు. బంగారం అమ్మే ఈ ఫోన్ తీసుకోవడానికి వచ్చాను అని తెలిపాడు.

కాబోయే భార్య కోసం కొత్త ఐఫోన్

అక్కడే ఉన్న పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్ అనే వ్యక్తిపి అడగ్గా.. అతను తన కాబోయే భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనడానికి తన స్నేహితుడితో కలిసి నోయిడా వరకు వచ్చినట్టు తెలిపాడు. త్వరలో తన పెళ్లి జరగబోతుందని.. తన కాబోయే భార్యకు బహుమతిగా ఇవ్వడానికి ఐఫోన్ 18 ప్రో కొంటున్నాని.. అతను చెప్పాడు. వీరిద్దరూ ఉదయం 6 గంటల నుంచి స్టోర్ బయట వేచి ఉన్నారు.

కపుల్ గోల్స్

అక్కడున్న మరో మహిళ మాట్లాడుతూ.. తన భర్తతో కలిసి రెండు ఐఫోన్ 18 ప్రో ఫోన్లు కొనడానికి వచ్చినట్టు తెలిపారు. అయితే తాజాగా పెరిగిన ధరలపై తమ అభిప్రాయాన్ని అడగ్గా.. ధరలు ఎంత పెరిగినా.. తమ ఇష్టమైన ఫోన్స్ కోసం జనాలు ఎంతైనా ఖర్చుపెడతారని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తాను తన భర్త ఇద్దరం.. ఐఫోన్ డియోను కొనాలనుకుంటున్నట్టు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్, మటన్ లేకుండానే నాన్‌వెజ్ రుచి.. ఇంట్లోనే స్పెషల్ గ్రేవీ!
చికెన్, మటన్ లేకుండానే నాన్‌వెజ్ రుచి.. ఇంట్లోనే స్పెషల్ గ్రేవీ!
ఈ గ్రామంలో కోడి కూత వినిపించదు.. కోడిగుడ్డు తినరు !
ఈ గ్రామంలో కోడి కూత వినిపించదు.. కోడిగుడ్డు తినరు !
హైదరాబాద్‌లో ‘హీట్‌ అక్టోబర్‌’.. తగ్గని ఎండ తీవ్రత
హైదరాబాద్‌లో ‘హీట్‌ అక్టోబర్‌’.. తగ్గని ఎండ తీవ్రత
భారత్‌పై గ్రాండ్‌గా డెబ్యూ.. కట్‌చేస్తే.. 12 ఏళ్ల బ్యాన్
భారత్‌పై గ్రాండ్‌గా డెబ్యూ.. కట్‌చేస్తే.. 12 ఏళ్ల బ్యాన్
సోషల్ మీడియాలో వైద్యుల ప్రమోషన్లపై ఎన్‌ఎంసీ గైడ్ లైన్స్
సోషల్ మీడియాలో వైద్యుల ప్రమోషన్లపై ఎన్‌ఎంసీ గైడ్ లైన్స్
AIతో పని గంటలు తగ్గుతాయా? జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
AIతో పని గంటలు తగ్గుతాయా? జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడికి అత్తగా నటించా..
ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడికి అత్తగా నటించా..
UPSCలో 24వ ర్యాంకు.. రూ.45వేల కోచింగ్‌తో ప్రిలిమ్స్‌కు సన్నద్ధత
UPSCలో 24వ ర్యాంకు.. రూ.45వేల కోచింగ్‌తో ప్రిలిమ్స్‌కు సన్నద్ధత
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ మాయలో పడొద్దు.. ఈ ట్రిక్‌ పాటించండి..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ మాయలో పడొద్దు.. ఈ ట్రిక్‌ పాటించండి..
మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియక..
మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఎందుకు పూజించాలి? గోత్రం తెలియక..