AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బైక్ డిక్కీ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని ఓపెన్ చేయగా..

ఈ వానాకాలం భద్రంగా ఉండండి... పాములు వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎక్కడ మరుగు దొరికితే అక్కడ అవి సెటిల్ అవుతాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

Viral Video: బైక్ డిక్కీ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని ఓపెన్ చేయగా..
Snake
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2024 | 4:56 PM

Share

ప్రస్తుతం వర్షాకాల సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాములు.. నివాసాలను కోల్పోయి… వెచ్చదనం కోసం జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఎక్కడ మరుగు కనిపిస్తే అక్కడి నక్కి ఉంటాయి. మనిషి కనిపించగానే ఆపదగా భావించి కాటు వేస్తాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ఉండేవాళ్లు, పంట పొలాలకు దగ్గరగా ఉండేవాళ్లు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా పాము స్కూటీలో నక్కిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒక స్కూటర్ పెట్రోల్ ట్యాంక్ చుట్టూ ఒక చిన్న కొండచిలువ.. చుట్టేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఘటన తాలూకా పూర్తి వివరాలు తెలియలేదు కానీ.. అక్కడి వ్యక్తులు మలయాళం మాట్లాడటాన్ని బట్టి కేరళలో జరిగిందని భావించవచ్చు. వీడియోను దిగువన చూడండి…

View this post on Instagram

A post shared by Salihkt Mullambath (@salihktmullambath)

వీడియో స్టార్టింగ్‌లో.. ఓ వ్యక్తి కర్ర పట్టుకుని.. స్కూటర్ బ్యాక్ సైడ్ డిక్కీని ఎత్తి చూపడం గమనించవచ్చు. పెట్రోల్ కొట్టే మూత చుట్టూ పైథాన్ చుట్టకట్టుకుని సేదతీరుతుంది. అసలు పాము అక్కడికి ఎలా చేరిందో ఎవరికీ అర్థం కావడం లేదు. సాలిహ్త్ ముల్లాంబత్ అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. 70 వేల వ్యూస్.. 5 వేల వరకు లైక్స్ వచ్చాయి. ఈ ఆశ్చర్యకరమైన వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. “పెట్రోల్ ట్యాంక్‌లో ఫ్యూయల్ ఎంత ఉందో చూసేందుకు చూసేందుకు అది అక్కడికి వెల్లినట్లుంది!” అని ఒక వ్యక్తి  కామెంట్ పెట్టాడు.“ఇది ఒక భారతీయ రాక్ పైథాన్ అని, ఇది విషపూరితం కాదు” అని మరొక వ్యక్తి వ్యాఖ్యానించాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us