Viral Video: డోర్ హ్యాండిల్‌కు చుట్టుకున్న పాము.. తలుపు తీయగా జరిగిన సీన్ ఇది.!

|

May 15, 2024 | 2:42 PM

చెట్టుకింద దయ్యం.. నాకేం భయం అన్న కథ విన్నాం కదా.. ఇది కూడా అలాంటిదే. కాకపోతే విషజాతికి చెందిన ఇవి. అడవుల్లో ఉండాల్సినవి.. ఈ మధ్య జనావాసాల్లో చేరి హడలెత్తిస్తున్నాయి. కాలి కిందకు వచ్చి చేరడమో.. లేదంటే ఇంట్లోకి రావడమో, వాహనాల్లో మనతో పాటు జర్నీ చేయడమో చేస్తూ.. ఒక్కసారిగా జడిపిస్తున్నాయి.

Viral Video: డోర్ హ్యాండిల్‌కు చుట్టుకున్న పాము.. తలుపు తీయగా జరిగిన సీన్ ఇది.!
Viral Video
Follow us on

చెట్టుకింద దయ్యం.. నాకేం భయం అన్న కథ విన్నాం కదా.. ఇది కూడా అలాంటిదే. కాకపోతే విషజాతికి చెందిన ఇవి. అడవుల్లో ఉండాల్సినవి.. ఈ మధ్య జనావాసాల్లో చేరి హడలెత్తిస్తున్నాయి. కాలి కిందకు వచ్చి చేరడమో.. లేదంటే ఇంట్లోకి రావడమో, వాహనాల్లో మనతో పాటు జర్నీ చేయడమో చేస్తూ.. ఒక్కసారిగా జడిపిస్తున్నాయి. సాధారణంగా పాము పేరు వింటే చాలు మనుషులు ఆమడదూరం జరుగుతారు.. ఎందుకంటే పాము కరిస్తే మామూలుగా ఉండదు.. క్షణాల్లో కాటికి వెళ్ళాల్సిందే.. మరి అలాంటిది పాము మన దగ్గరలో ఉన్నట్లయితే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ కూడా అదే సీన్.. వీడియో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం.. ఈ ఘటనలో అమెరికాలో చోటు చేసుకుంది. ఓ పాము ఎంచక్కా డోర్ హ్యాండిల్‌కి చుట్టుకుని పడుకుంది. ఇది తెలియని ఓ వ్యక్తి బయటకి వచ్చే క్రమంలో ఆ డోర్ హ్యాండిల్ పట్టుకుని తలుపు తీశాడు. ఠక్కున సెకన్లలో ఆ పాము అతడ్ని కాటేసింది. ఇలా జరుగుతుందని తెలియని ఆ వ్యక్తి మైండ్ దెబ్బకు బ్లాంక్ అయింది. కేవలం 14 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓసారి లుక్కేయండి.