Visakhapatnam Viral Video: సాధారణంగా చాలా దూరం నుంచే పామును చూస్తే పరుగులు పెడతాం.. కాస్త దగ్గర చూస్తే.. భయంతో చమటలు పడతాయి. ఇంకా తాచుపామును చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. ఇంకా బుసలు కొడితే.. ఇంకా చెప్పాల్సిన పనేలేదు. వామ్మో వింటుంటేనే భయమేస్తుంది కాదా..? అలాంటి తాచుపాముకు (Snake) గాయాలైతే.. నేవి అధికారులు దానికి చికిత్స చేసి సమీప అడవుల్లో వదిలేశారు. అవును మీరు వింటున్నది, చూస్తున్నది నిజమే.. ఇదేంటి పాము కనిపిస్తే చంపేస్తాం, లేదంటే పట్టించి సమీప అడవుల్లో వదిలేస్తాం. కానీ ఇక్కడ దెబ్బలు తగిలిన నాగుపాముకు సమీపంలోని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి మరీ చికిత్స చేయించారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
ఇది ఎక్కడో జరిగింది కాదు.. మన విశాఖపట్నం (Vishakapatnam) లో జరిగింది. మల్కాపురం లోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయంలో తాచుపాము కలకలం సృష్టించింది. వాహనాల పార్కింగ్ ప్రాంతంలో పామును గుర్తించిన నేవీ సిబ్బంది పాములు పట్టే వ్యక్తి నాగరాజుకు సమాచారం ఇచ్చారు. అక్కడకి చేరుకున్న నాగరాజు పామును పట్టుకున్నాడు.
అయితే పాము ఒంటిపై గాయాలుండడంతో చికిత్స చేయించాలని నేవీ అధికారులు భావించారు. దీంతో పాముకు పరిమిత స్థాయిలో మత్తు ఇచ్చి గాయాలైన చోట కుట్లు వేశారు. అనంతరం పాముకు స్పృహ వచ్చాక సమీపంలోని కొండప్రాంతంలో వదిలేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కళ్ళముందే జరుగుతున్న తంతు చూసి ఆశ్చర్యపోవడం అక్కడ చూపరుల వంతైంది.
వీడియో..
Also Read: