క్రిస్మస్ సీజన్ దగ్గర పడుతుండటంతో ఓ కుటుంబం తమ ఇంటి అలంకరణలతో బిజీగా ఉన్నారు. ఆ కుటుంబం మొత్తం ఇంటి అలంకరణలలో బిజీగా ఉన్నారు. ఓ పెద్ద క్రిస్మస్ త్రీని ఇంటికి తీసుకొచ్చారు. దానికి రిబ్బన్లు, రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తున్నారు. ఇంతలో వారికి క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వారంతా దాన్ని తీక్షణంగా పరిశీలించగా.. రిబ్బన్ స్థానంలో ఓ విషపూరితమైన పాము చుట్టుకుని కనిపించింది.! క్రిస్మస్ చెట్టుపై పాము.. అవును! మీరు విన్నది నిజమే ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో నివసిస్తున్న ఓ కుటుంబం క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇంటికి క్రిస్మస్ ట్రీని తెచ్చారు. ఇక దానికి రిబ్బన్లు, రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తుండగా.. చెట్టును చుట్టుకుని ఉన్న ఓ విషసర్పం వారి కంట పడింది. దీనితో భయభ్రాంతులకు గురైన ఆ కుటుంబం వెంటనే స్నేక్ క్యాచర్ జర్రాద్ వాయేకి సమాచారాన్ని అందించారు. సుమారు గంటన్నర పాటు శ్రమించిన అతడు.. ఆ పామును చెట్టును నుంచి తీసి దూరంగా అడవుల్లో విడిచిపెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.