Viral Video: బ్యాంకులో దూరిన పాము.. దెబ్బకు అటకెక్కిన ఉద్యోగులు..వీడియో చూస్తే నవ్వలేక పోట్టచెక్కలే..

మధ్యప్రదేశ్‌లోని దాటియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పాము ప్రవేశించడంతో ఉద్యోగులు, కస్టమర్లు భయంతో వణికిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కుర్చీలు, టేబుళ్లపైకి ఎక్కారు. బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సరదా సన్నివేశం వీడియోగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Viral Video: బ్యాంకులో దూరిన పాము.. దెబ్బకు అటకెక్కిన ఉద్యోగులు..వీడియో చూస్తే నవ్వలేక పోట్టచెక్కలే..
Snake Slithered Into The Bank

Updated on: Dec 02, 2025 | 7:31 PM

పాములంటే అందరికీ భయమే.. అందరూ పాములకు భయపడతారు. అక్కడెక్కడో పాము ఉందని తెలిస్తే.. ముందుగా జాగ్రత్తగా పడతారు చాలా మంది. ఇక పాము ఎదురు వచ్చిందంటే.. కొందరు భయంతో వణికిపోతారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పాముకు దూరంగా పారిపోతుంటారు. అయితే, రద్దీగా ఉండే ప్రదేశంలో పాము కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అది కూడా బ్యాంకు ఉద్యోగుల మధ్య పాము కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ సీన్‌ ఊహించలేం.. కానీ, అలాంటి ఒక సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఉద్యోగులందరూ పామును చూసి పరిగెడుతున్న దృశ్యాలు చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే..

వైరల్‌ వీడియోలో అది ఒక బ్యాంక్‌ అని తెలుస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది కస్టమర్ల మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ, అనుకోకుండా ఒక పాము దూరింది. అంతే పామును చూసిన ఉద్యోగులు ఉరుకులు, పరుగులు మొదలుపెట్టారు. షాక్‌కు గురైన ఉద్యోగులు భయంతో కూర్చీలు, టేబుళ్లపైకి ఎక్కి నిలబడ్డారు. బ్యాంకు కార్యకలాపాలు ఆగిపోయాయి. అది వేరే విషయం. ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో బ్యాంకు ఉద్యోగులు పాము నుండి తమను తాము రక్షించుకోవడానికి విఫల యత్నం చేస్తున్నారు. కొందరు టేబుళ్లపై, కొందరు కుర్చీలపై, మరికొందరు కౌంటర్లపైకి ఎక్కుతుండగా ఇంకొందరు అల్మారాపైకి ఎక్కి కూర్చోవటం మనం చూడొచ్చు. ఇక పాము కూడా కార్యాలయ ప్రాంగణం అంతటా తిరుగుతోంది. కొందరు సిబ్బంది ధైర్యం చేసి వైపర్లతో పామును తరిమే ప్రయత్నం చేశారు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని దాటియా నుండి వచ్చినట్లు తెలిసింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రాంగణంలో పాము ప్రత్యక్షం కావడంతో ఉద్యోగులు ఇలా పడరాని పాట్లు పడ్డారు.

ఈ వీడియో X లో షేర్ చేయబడిన కొన్ని గంటల్లోనే చాలా లైక్‌లను అందుకుంటోంది. ఘర్ కే కలేష్ పేజీ ఇప్పటికే దాదాపు 33,000 వ్యూస్‌ సాధించింది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఫన్ని కామెంట్లతో స్పందించారు. ఒకరు సరదాగా ఆ పాము బ్యాంక్‌ ఖాతా తెరవడానికి వచ్చిందని రాశారు. మరొకరు ఈ పామును భోజనం తర్వాత రమ్మని చెప్పు అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..