Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

Snake Making Ball: సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి...

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
Snake Video

Updated on: May 05, 2021 | 8:15 PM

Snake Making Ball: సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అదే సమయంలో పలు రేర్ వీడియోలు సైతం ట్రెండ్ అవుతాయి. వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోతుంటారు. ఇటీవల కాలంలో ఓ అరుదైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అదేంటో మీరు కూడా చూసేయండి.

ఇందులో పెద్ద సంఖ్యలో పాములు ఓ చెట్టు మీద ఒకదానితో మరొకటి చుట్టుకుని ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోను అమెరికాలోని మోంటానాకు చెందిన ఒక మహిళ తీసింది. ఈ రకమైన సంఘటనను స్నేక్ బాల్ అని అంటారు. సాధారణంగా గార్టెర్ పాములలో ఇలా ప్రవర్తిస్తుంటాయట.

ఈ వీడియోను కాస్సీ మోరిస్సే అనే మహిళ చిత్రీకరించింది. ఆడ పామును ఆకర్షించడంలో భాగంగా గార్టెర్ పాములు ఇలా చేస్తాయని చెబుతున్నారు. ఇక ఎర్త్ టచ్ న్యూస్ ప్రకారం, ఉత్తర అమెరికా అంతటా స్నేక్ బాల్స్ సంభవించడం సర్వ సాధారణం అని తెలుస్తోంది.

Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌