అది స్థానికంగా ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీ. రోజూలాగే సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అంతా బాగానే జరుగుతోంది. అయితే ప్రిన్సిపల్ చెప్పిన రికార్డ్స్‌ను తీసుకురావడానికి.. వాటిని భద్రపరిచే బీరువా దగ్గరకు ప్యూన్ వెళ్లగా.. ఏదో వింత శబ్దాలు వినిపించాయి. పెద్దగా పట్టించుకోని అతడు ఆ రికార్స్ భద్రపరిచే బీరువాను ఓపెన్ చేయగా.. కనిపించిన దృశ్యాన్ని చూసి గట్టి షాక్ తిన్నాడు. ఎదురుగా బుసులు కొడుతున్న త్రాచుపాము.. వెంటనే భయంతో అక్కడ నుంచి పరుగులు తీశాడు. అసలు దీని కథేంటి.? ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు తెలుసుకుందాం.!
ఈ మధ్యకాలంలో పాములు తరచూ జనావాసాల్లో రావడం సర్వ సాధారణం అయిపోయింది. సాధారణంగా దూరం నుంచి పాములను చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది అవి మన దగ్గరగా ఉంటే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. ఇదే సీన్ తాజాగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో త్రాచుపాము కలకలం రేపింది. కాలేజీ కార్యాలయంలోని రికార్డ్స్ భద్రపరిచే బీరువా వద్ద కార్యాలయ సిబ్బంది త్రాచుపామును గుర్తించారు. భయంతో బయటికి పరుగులు తీసిన కార్యాలయ సిబ్బంది వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్‌కు అందించారు. కాగా, అక్కడికి చేరుకొని స్నేక్ క్యాచర్ పామును చాకచక్యంగా పట్టుకోవడంతో కాలేజీ సిబ్బంది మొత్తం ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: