మినరల్ వాటర్ యాడ్‌లో ఒంటె బ్రాండెడ్ వాటర్ తాగడం మీరు చూసే ఉంటారు. కానీ, ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్న పాము వీడియో వైరల్ అవుతోంది. ప్రజలు పాములకు పాలు తాగిస్తుంటారు. పాలు తాగించడం వల్ల పాము చనిపోతుందని చెబుతారు. కానీ, ఇక్కడ ఒక పాము మాత్రం మినరల్ వాటర్ తాగుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. అందిన సమాచారం ప్రకారం..
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ధాన్యం వ్యాపారి వీరేంద్ర అగర్వాల్ ఇంట్లో ధాన్యం బస్తాల మధ్య ప్రమాదకరమైన నాగుపాము నక్కి ఉండటం గమనించారు. గోదాములో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ విశ్వకర్మకు సమాచారం అందించారు. శ్రీకాంత్ వెంటనే గోదాం వద్దకు చేరుకుని నాగుపామును రక్షించారు. పామును రక్షించిన తరువాత అతడు.. దానిని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టాడు. అయితే, ముందుగా నాగుపామును చాకచక్యంగా పట్టేసిన స్నేక్ క్యాచర్ శ్రీకాంత్.. ఆ పాము చాలా భయపడి, కంగారుగా ఉన్నట్లు గుర్తించాడు. దాంతో వెంటనే అతడు సీసాలోంచి పాముకి నీళ్లు తాగించాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పాములు పాలు తాగడం చూస్తారు. పాము మినరల్ వాటర్ తాగుతున్న వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.
मध्य प्रदेश के बैतूल में एक सांप पकड़ा गया।
सांप बेहद जहरीला था। कोबरा को एक सर्पमित्र ने रेस्क्यू किया तो देखा कि वह बेहद परेशान है।
सांप को बोतल से पानी पिलाया, वीडियो वायरल है ।#Snake #ViralVideo #MadhyaPradesh pic.twitter.com/zW7Uk2R40z
— Avinash Tiwari (@TaviJournalist) February 17, 2024
స్నేక్ క్యాచర్ రక్షించిన పాము చాలా విషపూరితమైనదిగా తెలిసింది.. ఈ పాము ఎవరినైనా కాటేసి ఉంటే, బాధితుడు కొన్ని నిమిషాల్లో చనిపోయేవాడని చెప్పాడు. పాము కాటేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, బాబా, భూతవైద్యం అంటూ ప్రాణాలను రిస్క్‌లో పెట్టరాదని ప్రజలకు సూచించాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..