
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక పోస్ట్‌లో ఒక పాము సైకిల్ హ్యాండిల్‌బార్లు, బ్రేక్‌ల మధ్య హాయిగా చుట్టుకుని సేదతీరుతోంది. అదేదో దాని సొంత సింహాసనంలాగా భావించింది అనుకుంటా..! ఆ పాము చూసేందుకు శరీరంపై నలుపు-తెలుపు చారల నమూనా, దాని కళ్ళ వెనుక ఉన్ననల్లటి గీతలు, ఒక వింత మెరుపు ప్రజలను ఇది ప్రమాదకరం అని అనుకునేలా కనిపిస్తుంది. ఇది నిజంగానే ఇంటర్నెట్ వేదికగా ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా ఉంది.
ఫోటోను విశ్లేషించిన తర్వాత, నిపుణులు ఆ పాము చెకర్డ్ కీల్‌బ్యాక్ అని నిర్ధారించారు. దీనిని శాస్త్రీయంగా జెనోక్రోఫిస్ పిస్కేటర్ అని పిలుస్తారు. భారతదేశంలో విస్తృతంగా కనిపించే ఈ పాము ఎక్కువగా నీటి దగ్గర నివసిస్తుంది. ఇది మనుషులకు దూరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది విషపూరితమైనది కాదు. ప్రజలను భయపెట్టే దాని గీతల చర్మం కేవలం ఒక అందమైన గుర్తింపు లక్షణం. ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Does anyone know this snake
byu/This-Park3826 inKerala ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుండి కామెంట్ల వరదకు దారితీసింది. ఒక వినియోగదారుడు ఇలా వ్రాశాడు, సోదరా, సైకిల్ ఇప్పుడు పాము సొంతం అంటున్నారు. కొంతమంది భయాన్ని వ్యక్తం చేశారు. కానీ, నిపుణులు, ఇది హానిచేయని నీటి పాము అని దానిని ఇబ్బంది పెట్టవద్దు అని అంటున్నారు. పాములు ఎక్టోథెర్మిక్ జీవులు, బాహ్య వాతావరణం నుండి వేడిని గ్రహిస్తాయి. వర్షం లేదా చలి కాలంలో అవి పొడి, వెచ్చని, సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్తాయి. గ్యారేజీలు, కార్ హుడ్స్, సైకిల్ హ్యాండిల్‌బార్లు వంటి ప్రదేశాల్లో అవి ఎక్కువగా నక్కి దాక్కుంటాయి. కాబట్టి, వర్షాకాలం, చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..