Snake Viral Video: సహజంగానే అటవీ జంతువులకు మనుషులు దూరంగా ఉంటారు. ప్రాణాపాయం పొంచి ఉన్నందున వాటి జోలికి కూడా ఎవరూ వెళ్లడానికి సాహసించరు. కొద్దోగొప్పో మంది మాత్రం అటవీ జంతువులతో చెలగాటమాడుతుంటారు. ముఖ్యంగా పాముల పేరు వింటేనే ప్రజలు హడలిపోతారు. పాములు కాటేస్తే ప్రాణాలు పోయే ఛాన్స్ దాదాపు ఖాయం. అటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా పాము జోలికి వెళ్లడానికి సాహసించరు. కొందరు పాముల ప్రేమికులు, స్నేక్ క్యాచర్స్ మాత్రం కాస్త ధైర్యం చేసి.. వాటిని రక్షించడానికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వెంట్రుకలు చూస్తే గూస్‌బమ్స్ రావడం ఖాయం. ఓ వ్యక్తి పాముతో చెలగాటమాడాడు. హడలెత్తిస్తున్న ఈ వీడియోను ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది.
చాలా మందికి పాములంటే భయం. అందుకే ప్రజలు దానికి దూరంగా ఉంటారు. అయితే, కొందరు మాత్రం పాములతో దాగుడు మూతలు ఆడేందుకు ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి చెలగాటానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి షూ వేసుకుని ఉన్నాడు. ఎదురుగా పాము ఉండగా.. దానిని రెచ్చగొట్టాడు. బూటు కాలితో దానికి ఆగ్రహం తప్పించాడు. మరి పాము ఊరుకుంటుందా! సహజంగానే.. పాము తీవ్రంగా స్పందిస్తుంది. ఇక్కడ కూడా సహనం కోల్పోయిన పాము.. వ్యక్తి బూటుపై కాటు వేసింది. తీవ్రంగా దాడి చేసింది. అయితే బూటు చాలా మందంగా ఉండటంతో పాము కోరలు.. ఆ షూ లో ఇరుక్కుపోయాయి. పాము కాటు వేసిన సమయంలో దాని ఆగ్రహం కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ షాకింగ్ వీడియోను ‘హనీనందు143’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది నెటిజన్లు వీక్షించారు. పాము రియాక్షన్‌పై నెటిజన్లు తమ తమ స్టైల్‌లో స్పందిస్తున్నారు.
Also read:
Andhra Pradesh: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్..
Andhra Pradesh: అటు ఆమెతో.. ఇటు ఈమెతో వ్యవహారం నడిపాడు.. చివరకు అడ్డంగా బుక్కయిన పోలీసు..