Viral Video: ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా వింత వీడియోలు జంతువులకు సంబంధించినవే. జంతువులు తమ ఆహారాన్ని వేటాడే వీడియోలు నిత్యం మనం చూస్తూ ఉంటాం.. ఈ వీడియో కూడా అలాంటిదే.. తమ ప్రాణాలమీదకు వస్తే ఎంత చిన్న జంతువైనా ఎదురు తిరిగి పోరాడుతుంది. పాములు చుస్తేనే మనం వణికిపోతాం.. అలాంటి పాము ఒక్కసారిగా దాడికి దిగితే.. చిన్న ప్రాణులను ఇట్టే మట్టు పెట్టి తినేస్తాయి పాములు ఈ వీడియోలో పాము కూడా అదే చేసింది ఓ కుందేలు పై దాడి చేసింది. కానీ ఆ పాముకు ఊహించని షాక్ ఇచ్చింది కుందేలు.
ఓ పార్క్ లోని గడ్డిలో ఉన్న ఓ కుందేలు పై ఒక్కసారిగా దాడి చేసింది ఓ పాము. ఆ కుందేలును కాటేసి ఆతర్వాత చుట్టేసి మింగేయాలని ప్రయతించింది. కానీ కుందేలు ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో పోరాడింది. పాముకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దానిపై దాడి చేసింది. పాము ఆ కుందేలును చుట్టేయాలని ప్రయత్నించినా.. అది కుదరలేదు. చివరకు కుందేలును విడిచి పాము వెళ్లిపోతున్నా ఆ కుందేలు మాత్రం దాన్ని వెంబడించి మరీ దాడి చేసింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదినేచర్ 27 పేజీ నుండి ఇంస్టాగ్రామ్ లో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోని వేలమంది వీక్షించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :