Watch: స్మార్ట్ టాయిలెట్ అంటే ఇదేనా..? నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు గురూ..!

|

Aug 05, 2024 | 4:54 PM

ఈ స్మార్ట్ టాయిలెట్ రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తాయి. కొన్నిసార్లు వాయిస్ తో పనిచేసేలా  కూడా ఇందులో సెట్టింగ్స్ పనిచేస్తాయి. దీనితో టాయిలెట్ సీటును ఎత్తడానికి చేతులు లేదా బటన్లు అవసరం లేదు. కేవలం ఒక్క మాట చాలు.. టాయిలెట్ సీటు తెరుచుకుంటుంది. కవర్ ఓపెన్‌ చేసుకుంటుంది. ఫ్లష్ కూడా దానికదే ఆన్ అవుతుంది. ఎంత ఫ్లష్ చేయాలి అనేది మీరు టాయిలెట్ సీటుపై ఎంత సమయం గడుపుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుందట. అయితే, ఇలాంటి స్మార్ట్‌ టాయిలెట్ వాడుతున్న ఓ వ్యక్తి..

Watch: స్మార్ట్ టాయిలెట్ అంటే ఇదేనా..? నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు గురూ..!
Smart Toilet
Follow us on

సాంకేతికతకు మానవ లోపాన్ని భర్తీ చేసి జీవితాన్ని సులభతరం చేసే శక్తి ఉంది. మనుషులు చేయలేని ఎన్నో పనులు టెక్నాలజీ చేస్తుంది.  కానీ, కొన్నిసార్లు సాంకేతికత కూడా నిరాశపరిచే పరిస్థితులు ఎదురవుతుంటాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ మనల్ని ట్రాప్ చేస్తే ఏం జరుగుతుందో ఊహించండి. ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తికి అలాంటిదే జరిగింది. స్మార్ట్‌ టెక్నాలజీ కారణంగా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది.. అతడు వాడుతున్న టెక్నాలజీ పనిచేయకపోవటంతో అతడి కష్టం వర్ణనాతీతంగా మారింది. స్మార్ట్‌ టాయిలెట్‌ యూజ్‌ చేస్తున్న ఓ వ్యక్తికి ఎదురైన అనుభవం అతన్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో వీడియో చూపించే వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

స్మార్ట్ టాయిలెట్ ఎలా పని చేస్తుంది?

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో ఒక వ్యక్తి స్మార్ట్ టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ స్మార్ట్ టాయిలెట్ రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తాయి. కొన్నిసార్లు వాయిస్ తో పనిచేసేలా  కూడా ఇందులో సెట్టింగ్స్ పనిచేస్తాయి. దీనితో టాయిలెట్ సీటును ఎత్తడానికి చేతులు లేదా బటన్లు అవసరం లేదు. కేవలం ఒక్క మాట చాలు.. టాయిలెట్ సీటు తెరుచుకుంటుంది. కవర్ ఓపెన్‌ చేసుకుంటుంది. ఫ్లష్ కూడా దానికదే ఆన్ అవుతుంది. ఎంత ఫ్లష్ చేయాలి అనేది మీరు టాయిలెట్ సీటుపై ఎంత సమయం గడుపుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుందట. అయితే, ఇలాంటి స్మార్ట్‌ టాయిలెట్ వాడుతున్న ఓ వ్యక్తి అది పనిచేయకపోవటంతో ఎలాంటి కష్టాల్లో పడ్డడో వీడియోలో చూడాల్సిందే..


ఈ వీడియో @chineseteacher_lindy అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన స్మార్ట్ టాయిలెట్‌ని ఓపెన్‌ కావాలంటూ అడుగుతున్నాడు. అతడు టాయిలెట్‌ని ఉపయోగించాలనుకుంటున్నట్లు ఆటోమేటిక్ స్మార్ట్ టాయిలెట్‌కు చెబుతాడు. సీట్ కవర్‌ను ఓపెన్ చేయాలంటే రిక్వెస్ట్‌ చేసుకున్నాడు. కానీ, స్మార్ట్ టాయిలెట్‌లో ఎటువంటి స్పందన లేదు. అతను మళ్లీ మళ్లీ ఓపెన్‌ ద టాయిలెట్‌ అంటూ అరుస్తున్నాడు..కానీ, టాయిలెట్ మూత కూడా కదలడం లేదు. ఇలా అతడు చాలా సేపు ప్రయత్నించాడు. ఎంతకీ టాయిలెట్ సీటు ఓపెన్ కాకపోవటంతో అతడు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌ నెట్‌లో వేగంగా వైరల్‌గా మారింది.

స్మార్ట్ టాయిలెట్‌లో సాంకేతిక లోపం, వాష్‌ రూమ్‌ అర్జెంట్‌గా వెళ్లానే అతడి తపన చూసి నెటి జనం తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకు 34 లక్షల మంది ఈ వీడియోను వీక్షించి కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ భయాందోళన పరిస్థితిపై ఫన్నీ రియాక్షన్స్‌ ఇస్తున్నారు. ఆఫీసుకి ఎందుకు లైట్‌ అయిందని బాస్‌ అడిగితే.. ఈ రోజు మా టాయిలెట్ ఓపెన్‌ కాలేదని బాస్‌కి చెబుతానంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..